`శశి` ట్రైలర్‌ విడుదల చేసిన పవన్‌ కళ్యాణ్‌.. టీమ్‌కి విషెస్‌

Published : Mar 10, 2021, 11:30 AM IST
`శశి` ట్రైలర్‌ విడుదల చేసిన పవన్‌ కళ్యాణ్‌.. టీమ్‌కి విషెస్‌

సారాంశం

ఆది సాయికుమార్ హీరోగా రూపొందుతున్న `శశి` చిత్ర ట్రైలర్‌ని తాజాగా పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ విడుదల చేశారు. చిత్ర బృందం ఆయన్ని ప్రత్యేకంగా కలిసి, ఆయన చేతుల మీదుగా ట్రైలర్‌ని విడుదల చేయించారు. ఈ సందర్భంగా పవన్‌ చిత్ర బృందాన్ని అభినందించారు. ట్రైలర్ బాగుందని ప్రశంసించారు.

ఆదిసాయికుమార్‌, సురభి జంటగా నటించిన చిత్రం `శశి`. శ్రీనివాస్‌ నాయుడు నడికట్ల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని శ్రీ హనుమాన్‌ మూవీ మేకర్స్ పతాకంపై ఆర్పీ వర్మ, రామాంజనేయులు, చింతలపూడి శ్రీనివాస్‌ నిర్మించారు. ఈ నెల 19న సినిమా విడుదల కానుంది. ఈ చిత్ర ట్రైలర్‌ని తాజాగా పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ విడుదల చేశారు. చిత్ర బృందం ఆయన్ని ప్రత్యేకంగా కలిసి, ఆయన చేతుల మీదుగా ట్రైలర్‌ని విడుదల చేయించారు. ఈ సందర్భంగా పవన్‌ చిత్ర బృందాన్ని అభినందించారు. ట్రైలర్ బాగుందని ప్రశంసించారు. ఇక తాజాగా విడుదలైన విశేషంగా ఆకట్టుకుంటుంది. విడుదలైన కాసేపట్లోనే లక్షల వ్యూస్‌ రావడం విశేషం. 

ఇందులో `మనం ప్రేమించిన వాళ్లు మన పక్కన ఉన్నప్పుడు ఎంత దైర్యంగా ఉంటుందో, ప్రమాదంలో ఉన్నప్పుడు అంతే భయంగా ఉంటుంది`.., `మనం ఏదైనా సాధించాలనుకున్నప్పుడు ముందు మన బలహీనతలను గెలవాలి`, `శశి అంటే రెండక్షరాలు కాదు వాడికి. మనిద్దరం. ఏ ఒక్కరు లేకపోయినా తట్టుకోలేడు`, `నీలాంటి కుర్రాడి ప్రేమ పెళ్లయ్యేంత వరకు హ్యాపీ మాత్రమే ఆలోచిస్తుంది. కానీ నాలాంటి తండ్రి ప్రేమ లైఫ్‌ లాంగ్‌ హ్యాపీగా ఉండటానికి ఆలోచిస్తుంది`, 

`ప్రేమంటే లేని చోట వెతుక్కోవడం కాదు, ఉన్నచోట నిలబెట్టుకోవడం..`, `మనల్ని ప్రేమించేవారు మనల్ని ఎప్పటికీ బాధపెట్టరు `, `ప్రేమించిన వాడితో పెళ్లి చేయకుండా, పెళ్లి చేసిన వాడితో ప్రేమగా ఉంటుందనుకోవడం మీ ముర్ఖత్వం` అనే డైలాగులు ఆద్యంతం ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇది పూర్తి లవ్‌ స్టోరీపై సాగే చిత్రంగా కనిపిస్తుంది. అమ్మాయి కోసం పిచ్చివాడిగా మారిన పాత్రలో ఆది కనిపిస్తారని అర్థమవుతుంది.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

ఫంకీ ట్రైలర్ రివ్యూ, త్రివిక్రమ్ ని అడిగితే ఏమన్నాడో తెలుసా.. నవ్వుల మోత, విశ్వక్ సేన్ కి భారీ హిట్ లోడింగ్ ?
మహేష్ బాబు నేచురల్ పెర్ఫార్మెన్స్ కి కృష్ణంరాజు ఫిదా, అది డైరెక్టర్ చేసిన మ్యాజిక్ అంటూ ప్రశంసలు