అలియాభట్‌ హోం క్వారంటైన్‌.. ఫ్రస్టేట్‌ అవుతున్న రాజమౌళి

Published : Mar 10, 2021, 09:14 AM IST
అలియాభట్‌ హోం క్వారంటైన్‌.. ఫ్రస్టేట్‌ అవుతున్న రాజమౌళి

సారాంశం

ప్రియుడు రణ్‌బీర్‌ కపూర్‌కి కరోనా సోకడంతో అలియా భట్‌ హోం క్వారంటైన్‌ అయిపోయింది. తనకి కరోనా వచ్చే ఛాన్స్ ఉందని భావించిన ఆమె సెల్ఫ్‌ క్వారంటైన్‌ అయిపోయింది. దీంతో ఆమె నటిస్తున్న సినిమా షూటింగ్‌లన్నీ ఆగిపోయాయి. దీంతో రాజమౌళి ఫ్రస్టేట్‌ అవుతున్నాడట. 

యంగ్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్‌కి కరోనా సోకిన విషయం తెలిసిందే. మంగళవారం ఈ విషయాన్ని రణ్‌బీర్‌ తల్లి నీతూకపూర్‌ అధికారికంగా వెల్లడించారు. ఇదిలా ఉంటే తాజాగా అలియా భట్‌ హోం క్వారంటైన్‌ అయ్యిందట. బాలీవుడ్‌లో వీరిద్దరు ప్రేమ పక్షులనే విషయం అందరికి తెలిసిందే. చాలా కాలంగా ఈ ఇద్దరు ప్రేమించుకుంటున్నారు. త్వరలోనే పెళ్లిపీఠలెక్కబోతున్నారు. అయితే తరచూ వీరిద్దరు కలిసి తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో రణ్‌బీర్‌కి కరోనా సోకడంతో అలియాకి భయం పట్టుకుంది. ఆయనతో తిరిగిన కారణంగా తనకు ఎక్కడ వైరస్‌ సోకిందో అని ఆందోళన చెందుతుంది. 

దీంతో అలియా భట్‌ హోం క్వారంటైన్‌ అయిపోయింది. తనకి కరోనా వచ్చే ఛాన్స్ ఉందని భావించిన ఆమె సెల్ఫ్‌ క్వారంటైన్‌ అయిపోయింది. దీంతో ఆమె నటిస్తున్న సినిమా షూటింగ్‌లన్నీ ఆగిపోయాయి. ప్రస్తుతం అలియా తెలుగులో `ఆర్‌ఆర్‌ఆర్‌`లో నటిస్తుంది. హిందీలో `గంగూబాయి కతియవాడి`, `బ్రహ్మాస్త్ర` చిత్రాల్లో నటిస్తున్నారు. `బ్రహ్మాస్త్ర`లో ప్రియుడు రణ్‌బీర్‌ కపూర్‌తో కలిసి ఆమె షూటింగ్‌లో పాల్గొన్నారు. దీంతో `బ్రహ్మాస్త్ర` టీమ్‌ సైతం ఆందోళన చెందుతుందట. 

ఇదిలా ఉంటే ఇప్పుడు `ఆర్‌ఆర్‌ఆర్‌` టీమ్‌కి ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారింది.  ముఖ్యంగా జక్కన్న తలపట్టుకుంటున్నాడట. ప్రస్తుతం సినిమా షూటింగ్‌ గ్యాప్‌ ఇచ్చారు. రామ్‌చరణ్‌ తన తండ్రి చిరంజీవితో నటిస్తున్న `ఆచార్య` షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. మరోవైపు ఎన్టీఆర్‌ `ఎవరు మీలో కోటీశ్వరులు` షో కోసం సన్నద్ధమవుతున్నారు. దీంతో కొంత గ్యాప్‌ తీసుకుంది యూనిట్‌. ఈ నేపథ్యంలో ఇప్పుడు క్లైమాక్స్ ని షూట్‌ చేయబోతున్నారు. ఇందులో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, అలియా, ఒలివియా మోర్రీస్‌ వంటి ప్రధాన తారాగణం పాల్గొనాల్సి ఉందట. దీంతోపాటు రామ్‌చరణ్‌తో అలియా కాంబినేషన్‌లో ఓ రొమాంటిక్‌ సాంగ్‌ని చిత్రీకరించాల్సి ఉందట. 

 కానీ ఉన్నట్టుండి అలియా హోం క్వారంటైన్‌ కావడంతో మరికొన్ని రోజులు సినిమా షూటింగ్‌ని వాయిదా వేయాల్సి వస్తుంది. దీంతో రాజమౌళి టీమ్‌ ఆందోళన చెందుతుందట. అనుకున్న డేట్‌కి వచ్చే విషయంలో ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని టెన్షన్‌ పడుతున్నారట. షెడ్యూల్‌లో మార్పులు చేయాల్సి వస్తుందట. ఇక ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్‌ 13న విడుదల చేయనున్న విషయం తెలిసిందే. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Akhanda 2 New Date: అఖండ 2 మూవీ కొత్త రిలీజ్‌ డేట్‌.. బాలయ్య ఊహించని సర్‌ప్రైజ్‌, ఈ సినిమాలకు పెద్ద దెబ్బ
Venkatesh: `నువ్వు నాకు నచ్చావ్‌` మూవీతో పోటీ పడి చిత్తైపోయిన నాగార్జున, మోహన్‌ బాబు చిత్రాలివే