‘కేజీఎఫ్‌’ హీరో తల్లికి, గ్రామస్తులకు మధ్య తీవ్ర వివాదం

By Surya PrakashFirst Published Mar 10, 2021, 8:23 AM IST
Highlights

ఒకే ఒక్క సినిమాతో నేషనల్ వైడ్ పాపులర్ అయ్యాడు కేజీఎఫ్ స్టార్ యశ్. అప్పటి వరకు కన్నడ ఇండస్ట్రీలో మాత్రమే స్టార్ హీరోగా ఉన్న ఈయన.. కేజియఫ్ సినిమా తర్వాత నేషనల్ స్టార్ అయిపోయాడు. ఈ చిత్రం సృష్టించిన సంచలనాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. దాంతో ఆయన గురించిన ఏ న్యూస్ వచ్చినా అది జాతీయ వార్త అయ్యిపోతోంది. తాజాగా  ‘కేజీఎఫ్‌’ హీరో యశ్‌ తల్లికి, గ్రామస్థులకి మధ్య గొడవ జరిగింది. ఈ విషయం ఇప్పుడు మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. యష్ కుటుంబీకులు, హాసన్ జిల్లాలోని గ్రామస్తుల మధ్య వివాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

యశ్‌ తల్లి కర్ణాటకలోని హాసన్ జిల్లాలోని తిమ్మెనహల్లి గ్రామానికి చెందినవారు. ఆ ఊళ్లో వాళ్లకో సొంత ఇల్లు ఉంది. రీసెంట్ గా 80 ఎకరాల భూమిని యశ్‌ కుటుంబం కొనుగోలు చేసింది. తమ పొలాలకు దారిని మూసివేశారని గ్రామస్థులు యశ్‌ తల్లి పుష్పలతతో గొడవ పడ్డారు.  స్థానికంగా ఉండే గ్రామస్తులు, యష్ తల్లిదండ్రులకు మధ్య తీవ్ర వాగ్వాదం మొదలైంది. వివాదం పెద్దది కావంతో గ్రామస్థులు దుద్ద పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

80 ఎకరాలకు కంచె వేస్తే తమ పొలాలకు వెళ్లడం కష్టమని, గ్రామ పటంలో ఉన్నట్లు దారి వదలాల్సిందేనని గ్రామస్తులు డిమాండ్‌ చేశారు. తాతల కాలం నుండి సాగు చేసుకొంటున్న భూముల్లోకి దారిని మూసివేయడం తగదని పట్టుబట్టారు. ఈ విషయమై చర్చించడానికి నటుడు యశ్‌ మంగళవారం తిమ్మాపురకు వెళ్లారు. యశ్‌ వస్తున్నట్లు తెలిసి వందలాది అభిమానులు పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. 
 
రహదారిని ఎట్టి పరిస్థితుల్లో నిర్మించకూడదని గ్రామస్తులు పట్టుబట్టగా.. కొంతమంది యష్ ఫ్యాన్స్ రంగంలోకి దిగి గొడవను సద్దుమనిగేలా చేశారు. ఆ తర్వాత సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఇరు వర్గాల మధ్య ఉన్న సమస్యను పరిష్కరించారు.  పోలీసులు ఇరువర్గాలను స్టేషన్‌కి పిలిపించి పంచాయతీ చేశారు.

click me!