బ్రేకింగ్ అప్డేట్: పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో పవన్ పవర్ఫుల్ మూవీ?

Published : Nov 19, 2018, 03:37 PM ISTUpdated : Nov 19, 2018, 03:42 PM IST
బ్రేకింగ్ అప్డేట్: పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో పవన్ పవర్ఫుల్ మూవీ?

సారాంశం

టాలీవుడ్ లో స్టార్ హీరోలందరిది ఒక దారైతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ది మరొక దారి. పొలిటికల్ గా కూడా అదే తరహాలో ముందుకు సాగుతున్నాడు. ఇకపోతే పవన్ రాజకీయాల్లో బిజీగా మారిన తరువాత అభిమానులు ఆయన్ను తెరపై చాలా మిస్ అవుతున్నారు. 

టాలీవుడ్ లో స్టార్ హీరోలందరిది ఒక దారైతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ది మరొక దారి. పొలిటికల్ గా కూడా అదే తరహాలో ముందుకు సాగుతున్నాడు. ఇకపోతే పవన్ రాజకీయాల్లో బిజీగా మారిన తరువాత అభిమానులు ఆయన్ను తెరపై చాలా మిస్ అవుతున్నారు. రాజకీయాల కోసమే సినిమాలు చేయలేని పరిస్థితి అని అభిమానులు అర్ధం చేసుకుంటున్నారు. 

అయితే ఇప్పుడు అలాంటి అభిమానులు ఎగిరిగంతేసే న్యూస్ బయటకు వచ్చింది. ఇంకా అధికారికంగా ఎలాంటి సమాచారం అందలేదు గాని పవన్ మళ్ళీ తెరపై పవర్ఫుల్ ఎంట్రీ ఇవ్వడం ఖాయమని తెలుస్తోంది. అయితే ఆ సినిమా ఆయన ప్రస్తుతం జీవన శైలికి తగ్గట్టుగా ఉంటుందని టాక్. ఒక పొలిటికల్ లీడర్ గానే ఆ సినిమాలో కనిపిస్తాడట. 

మరొక షాకింగ్ విషయం ఏమిటంటే పాత్ర కేవలం 45 నిమిషాల వరకే ఉంటుందని సమాచారం. రెండున్నర గంటల నిడివి గల ఆ కథలో మంచి క్రేజ్ ఉన్న యువ హీరో నటిస్తాడని తెలుస్తోంది. అంటే పవన్ ది స్పెషల్ క్యారెక్టర్ అన్నమాట. ఇప్పటికే ఇద్దరి హీరోలతో కథా చర్చలు నడుస్తున్నాయట. త్వరలోనే ఒక హీరోని ఫైనల్ చేసి ప్రాజెక్టును పట్టాలెక్కించడానికి ప్రముఖ నిర్మాత రామ్ తళ్ళూరి సన్నాహకాలు చేస్తున్నారు. 

ఈ ప్రొడ్యూసర్ ఇంతకుముందు రవితేజతో నేల టిక్కెట్టు అనే సినిమా చేశాడు.ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముందు ఆ సినిమా రిలీజ్ అయ్యే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మరి పవన్ డిఫరెంట్ ఎంట్రీ ఎలా ఉంటుందో చూడాలి. 

PREV
click me!

Recommended Stories

Rajinikanth Retirement .. 3 సినిమాల తర్వాత సూపర్ స్టార్ రిటైర్మెంట్ ప్రకటించనున్నారా?
Bigg Boss Telugu 9: లేటెస్ట్ ఓటింగ్‌లో ఊహించని ట్విస్ట్.. డేంజర్‌ జోన్‌లోకి టాప్‌ కంటెస్టెంట్లు