నందమూరి హీరో కన్నడ ప్రయత్నాలు!

Published : Nov 19, 2018, 03:07 PM IST
నందమూరి హీరో కన్నడ ప్రయత్నాలు!

సారాంశం

నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన మూడవ తరం వారసుల్లో ఎక్కువగా స్టార్ డమ్ తెచ్చుకున్న నటుడు జూనియర్ ఎన్టీఆర్. అయితే కెరీర్ మొదటి అడుగులోనే ఇబ్బందిపడ్డ ఆ తరువాత సరైన ప్లానింగ్ తో కష్టపడి సక్సెస్ లోకి వెళ్ళాడు. కళ్యాణ్ రామ్ కూడా అదే తరహాలో వెళ్లి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. 

మరో వారసుడు తారక రత్న మాత్రం ఆ స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. కెరీర్ మొదలైనప్పుడు ఏకంగా 7 సినిమాలను ఒకేసారి పట్టాలెక్కించి అప్పట్లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారాడు. అయితే ఏ సినిమాతో కూడా ఈ యువ హీరో యావరేజే టాక్ కూడా తెచ్చుకోలేదు. మధ్యలో ఎదో విలన్ గా చేసి పరవాలేధనిపించాడు గాని నటుడిగా పెద్దగా అవకాశాలు అందుకోలేదు. 

ఇక గత కొంత కాలంగా ఈ నటుడు అమృత వర్షిణి అనే ఒక సినిమా చేస్తున్నాడు. అసలు ఆ సినిమా చేస్తున్నట్లు కూడా ఎవరికీ తెలియదు. అయితే తప్పకుండా ఆడియెన్స్ కి న్యూ లుక్ లో కనిపించి ఆకర్షించాలని అనుకుంటున్నాడు. ఇకపోతే కన్నడలో కూడా ఆ సినిమాను భారీగా రిలీజ్ చేయడానికి తారకరత్న ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది/ 

కన్నడ ప్రేక్షకులు తెలుగు సినిమాలను తెగ ఇష్టపడతారు. కొంచెం అక్కడ హైప్ క్రియేట్ చేసినా కూడా క్లిక్ అవ్వచ్చు. అందుకే తారకరత్నం అక్కడ స్పెషల్ ప్రమోషన్స్ కూడా చేయనున్నట్లు సమాచారం. మరి ఆ ప్రయత్నాలు ఎంతవరకు కలిసొస్తాయా చూడాలి. శివప్రబు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మేఘశ్రీ హీరోయిన్ కాగా జెస్సి గిఫ్ట్ సంగీతమందిస్తున్నాడు

PREV
click me!

Recommended Stories

Remuneration: సౌత్‌లో అత్యధిక పారితోషికం తీసుకున్న ఒకే ఒక్కడు.. ఆయన ముందు ప్రభాస్, విజయ్‌, అల్లు అర్జున్‌ జుజూబీ
2025లో 8 జంటల సీక్రెట్ లవ్ ఎఫైర్స్ ..లిస్ట్ లో రాంచరణ్, ప్రభాస్, మహేష్ హీరోయిన్లు