
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజి చిత్రం కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఓజి చిత్రం గురించి ప్రతి చిన్న విషయం కూడా హైప్ పెంచే విధంగా ఉంది. డైరెక్టర్ సుజీత్ పీరియడ్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పవన్ కళ్యాణ్ డాన్ పాత్రలో నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అర్జున్ దాస్, ఇమ్రాన్ హష్మీ, శ్రీయ రెడ్డి లాంటి ప్రముఖ నటులు ఈ చిత్రంలో నటిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ కి జోడిగా ఈ చిత్రంలో క్యూట్ బ్యూటీ ప్రియాంక మోహన్ నటిస్తోంది. ప్రియాంక మోహన్ లాంటి క్యూట్ హీరోయిన్ పవన్ కి జోడిగా నటిస్తుండడంతో ఆసక్తి పెరిగిపోతోంది. నేడు ప్రియాంక మోహన్ తన 29వ జన్మదిన వేడుకలు సెలెబ్రేట్ చేసుకుంటోంది.
ఓజి చిత్రాన్ని డివివి దానయ్య నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే బ్యానర్ లో ప్రియాంక మోహన్ నాని సరసన 'సరిపోదా శనివారం' చిత్రంలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. దీనితో రెండు చిత్రాల నుంచి ప్రియాంకకి బర్త్ డే విషెస్ తెలుపుతూ కామం పోస్టర్ రిలీజ్ చేసారు.
అయితే పవన్ ఫ్యాన్స్ మాత్రం దీనిపై ఫన్నీగా ట్రోల్స్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్, ప్రియాంక మోహన్ కలసి ఉన్న పోస్టర్ రిలీజ్ చేస్తే చస్తావా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ రెండు చిత్రాల్లో ప్రియాంక లుక్ ఏ చిత్రంలోనిది అంటూ మరికొందరు సందేహం వక్తం చేస్తున్నారు.