రజనీకాంత్ జైలర్ చూడటానికి.. జపాన్ నుంచి చెన్నై వచ్చిన జంట..

Published : Aug 10, 2023, 12:15 PM IST
రజనీకాంత్  జైలర్ చూడటానికి.. జపాన్ నుంచి చెన్నై వచ్చిన  జంట..

సారాంశం

మన ఇండియన్ స్టార్స్ కోసం విదేశాల నుంచి సైతం అభిమానులు ఇండియాకు బారులుతీరుతున్నారు. తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్  కోసం జపాన్ నుంచి చెన్నై వచ్చారు ఓ జంట.  

జపాన్ లాంటి దేశాల్లో.. అభిమానులను సాధించిన హీరోగా ముందు రికార్డ్ క్రియేట్ చేశాడు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్. ఆయనకు  జపాన్ లోనూ వీరాభిమానులు భారీ సంఖ్యలో ఉన్నారు. ఆయన సినిమా విడుదల అయితే జపాన్ బాక్సాఫీసులు సైతం కళకళలాడి పోతాయి.  రజనీకాంత్ తరువాత చాలా మంది ఇండియన్ హీరోలకు ఇండియాలో అభిమానులు తయారయ్యారు. ముఖ్యంగా బాహుబలితో ప్రభాస్ కు భారీగా ఫ్యాన్స్ తయారయ్యారు. త్రిపుల్ ఆర్ తో ఎన్టీఆర్, రామ్ చరణ్ లకు కూడా డైహార్ట్ ఫ్యాన్స్ తయారాయ్యారు. 

వీరికే కాదు..తమిళ హీరో కార్తీకి, సూర్యకు, విక్రమ్ కు కూడా జపాన్ లో ఫ్యాన్స్ ఉన్నారు. ఆమధ్య ప్రభాస్ ను చూడటానికి జపాన్ ఫ్యాన్స్ హైదరాబాద్ వచ్చారు. కార్తీని కలవడానికి కొంత మంది జపాన్ అభిమానులు చెన్నై వెళ్ళారు. ఇక తాజాగా తైలవా  జైలర్ సినిమాను చూడటానికి  జపాన్ జంట చెన్నై వచ్చారు. కేవల సినిమా చూడటానికి అంత దూరం నుంచి వచ్చారంటే రజనీమీద వారికి ఎంత అభిమానం ఉందో తెలుస్తోంది. నేడు(10 అగస్ట్)  ప్రపంచవ్యాప్తంగా విడుదల అయింది జైలర్ సినిమా. ఈసినిమా జపాన్ లో రిలీజ్ అవ్వడానికి చాలా టైమ్ ఉంది. 

అయితే జపాన్ లోకి ఒసాకా పట్టణానికి చెందిన ఓ జంట రజనీకాంత్ జైలర్ మూవీ చూసేందుకు భారీగా ఖర్చు చేసుకుని.. ఫ్లయిట్ ఎక్కి చెన్నైకి చేరుకున్నారు. అయితే  అంతదూరం నుంచి.. ఇంత శ్రమపడి సినిమా చూడటానికి ఇంత దూరం రావడానికి కారణం ఏంటి అని వారిన ప్రశ్నించగా.. రజనీకాంత్ సినిమాను.. ఆయను అభిమానించే వేలాదిమంది అభిమానుల మధ్య సినిమాని ఆయన రాష్ట్రంలోనే చూడాలని అనుకుని వచ్చారట.  ప్రస్తుతం ఈ జంట ఫోటో వైరల్ అవుతోంది. ఈన్యూస్ కూడా హైలెట్ గా మారింది. 

PREV
click me!

Recommended Stories

Top 10 Heroines : రష్మిక కు సమంత గండం, సినిమాలు లేకున్నా మొదటి స్థానంలో ఎలా? టాప్ 10 హీరోయిన్ల లిస్ట్ ఇదే?
Malliswari Review: బావ మరదలుగా ఎన్టీఆర్, భానుమతి రొమాన్స్, ఫస్ట్ తెలుగు పాన్ వరల్డ్ మూవీగా మల్లీశ్వరి రికార్డు..