OG Release Date : పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే? అఫీషియల్

By Nuthi Srikanth  |  First Published Feb 6, 2024, 5:07 PM IST

పవన్ కళ్యాణ్ Pawan Kalyan ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ అందింది. పవర్ స్టార్ - సుజీత్ కాంబోలో రూపుదిద్దుకుంటున్న చిత్రం OG రిలీజ్ డేట్ వచ్చేసింది. తాజాగా మేకర్స్ అనౌన్స్ చేశారు. 


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్న చిత్రం OG. ఈ చిత్రాన్ని సుజీత్ దర్శకత్వం వహిస్తుండటంతో మరింతగా అంచనాలు పెరిగాయి. ఇప్పటికే పవన్ బర్త్ డే కానుకగా ఓజి టీజర్ OG Teaserను విడుదల చేశారు. దీంతో దర్శకుడు సుజీత్ పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి తగ్గట్లుగా ఏదో అద్భుతం సృష్టిస్తున్నాడు అంటూ ఫ్యాన్స్ లో అంచనాలు పెరిగిపోయాయి. టీజర్ తర్వాత సినిమా కోసం ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియెన్స్ కూడా ఎదురుచూస్తున్నారు. 

ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ క్రమంలోన పవన్ కళ్యాణ్ - సుజీత్ కాంబోలోని They Call Him OG కూడా రాబోతోంది. తాజాగా మేకర్స్ ఓజీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. 2024 సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుందని అధికారికంగా ప్రకటించారు. దీంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ ఏడాది చివర్లో మాస్ జాతరే అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

Latest Videos

అయితే, రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తూనే ఈ చిత్రంలోని పవన్ కళ్యాణ్ కు సంబంధించిన మాస్ స్టిల్ ను విడుదల చేశారు. బ్లాక్ జాకెట్, బ్లాక్ పాయింట్, కళ్ల జోడు పెట్టుకొని చేతిలో టీ గ్లాసు పట్టుకొని ఏదో లోకేషన్ ను బాగా అబ్జర్వ్ చేస్తూ కనిపించారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ లుక్ మాత్రం అదిరిపోయింది. సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసేలా చేశారు. ఇప్పటికే ఓజి టీజర్ లో పవన్ ను ముంబై మాఫియా బ్యాక్ డ్రాప్ లో చూపించడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. 

మొదటి నుంచి ఈ చిత్రం నుంచి వస్తున్న అప్డేట్స్ ... పవన్ కళ్యాణ్ స్వాగ్, స్టైల్ ఫ్యాన్స్ ని కట్టిపడేసేలా ఉన్నాయి. సుజీత్ టేకింగ్ మరో కొత్త ప్రపంచాన్ని చూస్తున్నట్లు అనిపిస్తోంది. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండటం విశేషం. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ కి జోడిగా ప్రియాంక మోహన్ Priyanka Arul Mohan నటిస్తోంది.  ప్రకాష్ రాజ్, శ్రియ రెడ్డి, అర్జున్ దాస్, ఇమ్రాన్ హష్మీ కీలక పాత్రలు పోషిస్తున్నారు.  

click me!