అందుకే పిల్లల్ని కనడం ఆలస్యం అయ్యింది... ఉపాసన కామెంట్స్ వైరల్ 

By Sambi Reddy  |  First Published Feb 6, 2024, 4:59 PM IST

మెగా కోడలు ఉపాసన పెళ్ళైన పదేళ్లకు తల్లైన విషయం తెలిసిందే. ఈ విషయంలో ఆమె అనేక విమర్శలు ఎదుర్కొంది. తాజాగా పిల్లల్ని లేటుగా ఎందుకు కనాల్సి వచ్చిందో వివరణ ఇచ్చింది. 
 


బిజినెస్ టైకూన్స్, దోమకొండ సంస్థానం వారసురాలైన ఉపాసన పై అప్పట్లో అనేక పుకార్లు చక్కర్లు కొట్టాయి. పెళ్ళై ఏళ్ళు గడుస్తున్నా ఆమె తల్లి కాలేదు. ఇకపై ఉపాసన తల్లి కావడం జరగదని కూడా కొందరు కామెంట్స్ చేశారు. విమర్శలకు చెక్ పెడుతూ 2022 డిసెంబర్ నెలలో చిరంజీవి శుభవార్త పంచుకున్నారు. ఉపాసన గర్భం దాల్చిన విషయం సోషల్ మీడియా వేదికగా తెలియజేశాడు. 

దాంతో మెగా ఫ్యాన్స్ లో ఆనందం వెల్లి విరిసింది. జూన్ 20న హైదరాబాద్ అపోలో హాస్పిటల్స్ లో ఉపాసన పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. పాపకు క్లింకార అనే పేరు పెట్టారు. అయితే ఆలస్యంగా పిల్లల్ని ఎందుకు కనాల్సి వచ్చిందో ఉపాసన తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆమె మాట్లాడుతూ... అమ్మ కావడం అందరూ గ్రేట్ అనుకుంటారు. నేను మాత్రం డబుల్ గ్రేట్ అంటాను. ఇంకా పిల్లల్ని ఎప్పుడు కంటారు? ఏమైనా సమస్యలు ఉన్నాయా? వంటి కామెంట్స్ నా వరకూ వచ్చాయి. 

Latest Videos

తల్లిదండ్రులు కావడానికి, పిల్లల్ని కనడానికి పూర్తిగా సన్నద్ధం అయ్యాకే ప్లాన్ చేయాలి అని రామ్ చరణ్, నేను అనుకున్నామని, ఉపాసన చెప్పుకొచ్చారు. ఇక రామ్ చరణ్ గురించి కూడా ఆమె ఆసక్తికర విషయాలు వెల్లడించారు. మా ఇద్దరి మధ్య కూడా బౌండరీలు ఉన్నాయి. వృత్తి పరమైన విషయాల్లో జోక్యం చేసుకోము. వ్యక్తిగతంగా కలిసి ఉంటాము. ఒకరి అభిప్రాయాలు మరొకరం గౌరవిస్తాము... అని ఉపాసన అన్నారు. 

2012లో ఉపాసన-రామ్ చరణ్ వివాహం ఘనంగా జరిగింది. వీరిది లవ్ మ్యారేజ్. పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. పెళ్ళైన తర్వాత దాదాపు 11 ఏళ్లకు తల్లిదండ్రులు అయ్యారు. ఉపాసన బిజినెస్ ఉమన్ గా రాణిస్తుంది. ఇక టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరిగా రామ్ చరణ్ దూసుకెళుతున్నారు. 
 

click me!