Pawar Star New Movie: వచ్చేనెలలో స్టార్ట్ కాబోతున్న పవర్ స్టార్ క్రేజీ ప్రాజెక్ట్, డైరెక్టర్ ఎవరో తెలుసా...?

Published : May 13, 2022, 09:17 PM IST
Pawar Star New Movie: వచ్చేనెలలో స్టార్ట్ కాబోతున్న పవర్ స్టార్ క్రేజీ ప్రాజెక్ట్, డైరెక్టర్ ఎవరో తెలుసా...?

సారాంశం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం హరిహర వీరమల్లు హడావిడిలో ఉన్న పవర్ స్టార్ మరో సినిమా ఓపెనింగ్ కు రెడీ అవుతున్నాడు. మరి అంతకుముందు కమిట్ అయిన సినిమాల సంగతేంటి.   

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం హరిహర వీరమల్లు హడావిడిలో ఉన్న పవర్ స్టార్ మరో సినిమా ఓపెనింగ్ కు రెడీ అవుతున్నాడు. మరి అంతకుముందు కమిట్ అయిన సినిమాల సంగతేంటి. 

పవర్ స్టార పవన్ కళ్యాణ్ నెక్ట్స్ మన్త్ కొత్త సినిమా ఓపెనింగ్ చేయబోతున్నాడని సమాచారం. అది కూడా ఇప్పుడు ఉన్న ప్రాజెక్ట్స్ లో ఒకటి మాత్రం కాదు. కొత్తగా అనుకున్న సినిమాను వెంటనే ఓపెనింగ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. రెగ్యూలర్ షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. 

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రిష్ డైరెక్షన్ లో హరిహరవీరమల్లు సినిమా చేస్తున్నాడు. అంతకు ముందే హరీష్ శంకర్ తో భవదీయుడు భగత్ సింగ్ సినిమా అనౌన్స్ చేశాడు పవన్. ఇప్పుడు మరో కొత్త సినిమా ను సెట్స్ ఎక్కిస్తున్నాడు. ఇప్పటిక హరిహరవీరమల్లు సినిమా విషయంలో ఎక్కవ టైమ్ కేటాయించాల్సి వస్తోంది. అటు హరీష్ శంకర్ కూడా పవన్ కోసం ఎదుర చూస్తున్నాడు. ఇప్పుడు కొత్త సినిమాను సముద్ర ఖని డైరెక్షన్ లో చేయబో్తున్నట్టు తెలుస్తోంది. 

శంభో శివ శంభో సినిమాతో  తెలుగు ప్రేక్ష‌కుల‌కు న‌టుడిగా, డైరెక్ట‌ర్‌గా ద‌గ్గర‌య్యాడు కోలీవుడ్ యాక్ట‌ర్ స‌ముద్ర‌ఖ‌ని. ఈ ఏడాది టాలీవుడ్ లో ప‌వ‌న్ క‌ల్యాణ్  న‌టించిన భీమ్లానాయ‌క్‌, మ‌హేశ్ బాబు న‌టించిన స‌ర్కారు వారి పాట సినిమాల‌తో మంచి బ్రేక్ అందుకున్నాడు. ఈ క్రేజీ యాక్ట‌ర్ క‌మ్ డైరెక్ట‌ర్ త్వ‌ర‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను డైరెక్ట్ చేయ‌బోతున్నాడు. 

ప‌వ‌న్ లీడ్ రోల్‌లో త‌మిళ సినిమా వినోద‌య సీత‌మ్  రీమేక్ తెర‌కెక్కించేందుకు రెడీ అవుతున్న స‌ముద్రఖ‌ని..దీనికి సంబంధించిన అప్‌డేట్‌ను అంద‌రితో షేర్ చేసుకున్నాడు. రీసెంట్ ఇంట‌ర్య్వూలో మాట్లాడుతూ..జులై నుంచి షూటింగ్ మొద‌లుపెట్ట‌నున్న‌ట్టు చెప్పాడు. టాలీవుడ్ యంగ్ స్టార్ హీరో సాయిధ‌ర‌మ్‌తేజ్  కూడా ఈ సినిమాలో కీలక పాత్ర‌లో నటిస్తున్నాడు. 

ఇక పవర్ స్టార్ ప‌వ‌న్  ఈ సినిమాలో దేవుడి పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడ‌ని టాక్‌.మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ మరోసారి డైలాగ్స్ అందించ‌నున్నట్టు తెలుస్తోంది. మరి ప‌వ‌ర్ స్టార్‌ను స‌ముద్ర‌ఖ‌ని ఎలా చూపించ‌బోతున్నాడ‌ని ఆస‌క్తికరంగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: చివరి రోజు ఓటింగ్‌ తలక్రిందులు, పక్కా ప్లాన్‌ ప్రకారమే.. టాప్‌లో ఉన్నదెవరంటే?
Karthika Deepam 2 Today Episode: దీప, కార్తీక్ లపై రెచ్చిపోయిన పారు, జ్యో- శ్రీధర్ పదవి పోయినట్లేనా?