డివోర్స్ కు అప్లై చేసిన బాలీవుడ్ నటుడు సోహైల్ ఖాన్, సీమా ఖాన్.. 24 ఏండ్ల వైవాహిక జీవితానికి ముగింపు..

By team teluguFirst Published May 13, 2022, 4:46 PM IST
Highlights

బాలీవుడ్ ప్రొడ్యూసర్, యాక్టర్ సోహైల్ ఖాన్, సీమా ఖాన్ తాజాగా తమ వైవాహిక జీవితానికి ముగింపు పలికారు. ఈ సందర్భంగా డివోర్స్ కోసం ముంబైలోని ఫ్యామిలీ కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం ఈ విషయం బీటౌన్ లో హాట్ టాపిక్ గా మారింది.
 

బాలీవుడ్  స్టార్ హీరో  సల్మాన్ సోదరుడు సోహైల్ ఖాన్ (Sohail Khan) , తన భార్య సీమా ఖాన్ (Seema Khan) నుంచి విడాకులు తీసుకోవడం బీటౌన్ లో హాట్ టాపిక్ గా మారింది. ప్రొడ్యూసర్ గా, నటుడిగా సోహైల్ ఖాన్ పలు చిత్రాల్లో నటించారు. సీమా ఖాన్ కూడా  ఫ్యాషన్ డిజైనర్ గా ప్రత్యేక గుర్తింపు పొందింది. వీరిద్దరూ 1998లో మ్యారేజ్ చేసుకున్నారు. ఇప్పటికీ వీరిద్దరికీ వివాహామై 24 ఏండ్లు పూర్తైయ్యింది. ఈ స్టార్ కపుల్ కు ఇద్దరు పిల్లలు నిర్వాణ్, యోహాన్ ఉన్నారు.   

24 ఏళ్ల వైవాహిక జీవితానికి ఈ రోజు ముగింపు పలుకుతూ ఇద్దరు ముంబైలోని ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా వీరిద్దరూ కోర్టు పరిసర ప్రాంతాల్లో కనిపించిన ఫుటేజీలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇద్దరి మధ్య ఏర్పడ్డ ఘర్షణల కారణంగా గత కొంత కాలంగా విడివిడిగానే ఉంటున్నారు. ఈ క్రమంలో ఈ రోజు (శుక్రవారం) కోర్టుకు హాజరవగా న్యాయస్థానం స్పందిస్తూ.. ‘సోహైల్ ఖాన్ మరియు సీమా సచ్‌దేవ్ ఈరోజు కోర్టుకు హాజరయ్యారు. వారు విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇద్దరూ ఒకరికొకరు ఇందుకు  స్నేహపూర్వకంగా ఉన్నారు.’ అని తెలిపింది. 

అయితే,  1970న ముంబైలో జన్మించిన సోహైల్ ఖాన్ ప్రస్తుతం 51 ఏండ్లకు చేరుకున్నాడు. ప్రముఖ స్క్రీన్ రైటర్ సలీం ఖాన్ కుమారులైన సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ మరియు అర్బాజ్ ఖాన్ ల తమ్ముడు సోహైల్ ఖాన్. ముగ్గురు ఖాన్‌లలో చిన్నవాడైన సోహెల్ నటుడిగా మారడానికి ముందే దర్శకుడిగా తన కేరీర్ ను ప్రారంభించారు. సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ‘ప్యార్ కియా తో డర్నా క్యా’ చిత్ర షూటింగ్ లో మొదటిసారిగా మొదటిసారి  సీమా సచ్ దేవ్ ను కలిశారు. వీరి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. దీంతో 1988లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు.

సోహైల్ ఖాన్ తన మొత్తం కెరీర్‌లో ఇప్పటివరకు ఆరు చిత్రాలకు దర్శకత్వం వహించాడు, వాటిలో ఐదు తన సోదరుడు సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్ర పోషించినవే.  2011 నుండి 2018 వరకు, అతను కామెడీ షో 'కామెడీ సర్కస్'లో న్యాయనిర్ణేతగా కనిపించాడు. 2017లో సోహైల్ ఖాన్ ‘ఛోటే మియాన్ ధకడ్’లో న్యాయనిర్ణేతగా కనిపించాడు. 

click me!