
‘అవతార్’ సినిమాతో ప్రేక్షకుల్ని పండారా గ్రహంలో ఊరేగించిన జేమ్స్ కామెరూన్.. ఇప్పుడు ‘అవతార్ 2’తో మరోసారి మనల్ని మెస్మరైజ్ చేయటానికి సిద్దపడుతున్నారు. ప్రపంచ సినీప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రమిది. ప్రస్తుతం తుది దశ లో మెరుగులు దిద్దుకుని రిలీజ్ కు రెడీ అవుతోంది. దాదాపు 13 సంవత్సరాల తర్వాత రాబోతున్న అవతార్ హీరో జేక్ ఈసారి తన భార్యా పిల్లలతో సహా సకుటుంబ సపరివార సమేతంగా థ్రిల్ చేయబోతున్నాడు. 2009లో వచ్చిన వరల్డ్ ప్రీమియర్ అవతార్ సీక్వెల్స్ కోసం ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్నారు ఆడియెన్స్. కొవిడ్ కారణంగా మళ్లీ వాయిదా పడిన అవతార్ 2 2022 డిసెంబర్ 16న రిలీజ్ కాబోతుంది.
ఈ సందర్భంగా అవతార్ 2 (Avatar 2)కు సంబంధించిన బజ్ వినిపిస్తోంది. అవతార్ 2ను మరింత ఎక్కువ మంది ప్రేక్షకులకు తమ ప్రాంతీయ భాషల్లోనే అందించనున్నారు. ఇందుకు ఏకంగా 160 భాషల్లో ఈ చిత్రాన్ని డబ్ చేసినట్టు తెలుస్తోంది. ఏక కాలంలో ప్రపంచ వ్యాప్తంగా ఒకేసారి అన్ని భాషల్లో ఈ భారీ చిత్రం విడుదల కాబోతోంది. అదే విధంగా ఈ చిత్రానికి సంబంధించి గ్లింప్స్ ను రేపు సినిమాకాన్ లో ప్రీమియర్ ప్రదర్శితం చేయనున్నట్టు తెలుస్తోంది. ఇక ట్రైలర్ ను కూడా మే 6న రిలీజ్ కాబోతున్న ‘డాక్టర్ స్ట్రేంజ్ మ్యాడ్ నెస్ ఆఫ్ మల్టీవర్స్’తో కలిసి థియేటర్ లో రిలీజ్ చేయనున్నట్టు బజ్ వినిపిస్తోంది.
ఇక ఈ చిత్రానికి మరో నాలుగు సీక్వెల్స్‌ను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు జేమ్స్ కామెరూన్. ఇందులో భాగంగా ‘అవతార్ 2’ని 2021లో విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా ప్రభావంతో షూటింగ్ ఆలస్యం అయ్యింది. ఆ మధ్య కేసులు తగ్గి యధా స్దితికి వచ్చాక ఈ సినిమా షూటింగ్ ను తిరిగి న్యూజిలాండ్‌లో మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసినట్టు తాజాగా జేమ్స్ కామెరూన్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘అవతార్ 2’ చిత్రీకరణ 100శాతం, ‘అవతార్ 3’ 95 శాతం పూర్తయింది.’ అని చెప్పారు కామెరూన్.
అవతార్ తర్వాత మొత్తం నాలుగు భాగాలని తెరకెక్కిస్తోన్న మేకర్స్.. ప్రతీ పార్ట్ కి 1900 కోట్లు ఖర్చు చేస్తున్నారు. అంటే మొత్తం నాలుగు సీక్వెల్స్ కి 11300 కోట్ల బడ్జెట్. ఈ స్థాయిలో సీక్వెల్ సినిమాల కోసం ఖర్చు చేయడం ప్రపంచ సినీ చరిత్రలోనే అరుదైన రికార్డ్.