పవన్ మూడ్ మారింది... వీరమల్లు కథ మొదటికొచ్చింది?

Published : Oct 21, 2022, 02:51 PM IST
పవన్ మూడ్ మారింది... వీరమల్లు కథ మొదటికొచ్చింది?

సారాంశం

పవన్ కళ్యాణ్ మూడ్ మారింది. ఆయన పూర్తిగా రాజకీయాలకు అంకితమయ్యారు. ఈ క్రమంలో హరి హర వీరమల్లు భవిష్యత్ మళ్ళీ ప్రమాదంలో పడ్డట్లు వార్తలు వస్తున్నాయి.   

హరి హర వీరమల్లు సినిమాను దర్శకుడు క్రిష్ ఏ ముహూర్తాన మొదలుపెట్టాడో కానీ అసలు ముందుకు కదలడం లేదు. కొన్నాళ్ళు లాక్ డౌన్, మరి కొన్నాళ్ళు పవన్ కళ్యాణ్ కమిట్మెంట్స్ కి సినిమా బలైంది. అసలు హరి హర వీరమల్లు త్వరగా పూర్తి చేయాలనే ఆసక్తి పవన్ లో లేకపోవడం కూడా ఒక కారణం. కారణం తెలియదు కానీ హరి హర వీరమల్లు సినిమా పట్ల ఆసక్తి చూపడం లేదు. మధ్యలో ఉన్న ఈ చిత్రాన్ని పక్కన పెట్టి పవన్ భీమ్లా నాయక్ పూర్తి చేయడం దీనికి నిదర్శం. 

భీమ్లా నాయక్ విడుదలయ్యాకైనా పూర్తి సమయం హరి హర వీరమల్లుకు కేటాయిస్తే ఈ పాటికి సినిమా తుది దశకు చేరేది. పవన్ పొలిటికల్ ఈవెంట్స్ తో బిజీ అయ్యాడు. అలాగే పవన్ కళ్యాణ్ స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు కోరాడని, ఆ పనిలో క్రిష్ ఉన్నాడంటూ కొన్నాళ్లు పుకార్లు వినిపించాయి. ఎట్టకేలకు పవన్ ని ఒప్పించి షూటింగ్ కి సిద్ధం చేశారు. పవన్ తన బస్సు యాత్ర కూడా రద్దు చేసుకోవడంతో సీరియస్ గా హరి హర వీరమల్లు పూర్తి చేస్తాడని అందరూ భావించారు. 

పరిస్థితులు చూస్తే హరి హర వీరమల్లు వ్యవహారం మళ్ళీ మొదటికొచ్చినట్లు అనిపిస్తుంది. ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. ఎన్నికలకు మరో 19 నెలల సమయం మాత్రమే ఉంది. నారా చంద్రబాబు నాయుడు-పవన్ కళ్యాణ్ భేటీ  అయ్యారు. వీరిద్దరూ మరలా పొత్తు పెట్టుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. మరోవైపు ప్రత్యర్థి వైసీపీ చాలా బలంగా ఉంది. దీంతో ఇప్పటి నుంచి బలంగా పోరాడాల్సి ఉంది. 

ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల వరకు సినిమాలు పూర్తిగా పక్కన పెట్టేస్తారు అంటున్నారు. మిగిలి ఉన్న హరి హర వీరమల్లు షూట్ కంప్లీట్ చేసే అవకాశం లేదని టాక్. ఇటీవల హరి హర వీరమల్లు నెక్స్ట్ షెడ్యూల్ కోసం వర్క్ షాప్ నిర్వహించారు. త్వరలో షూట్ మొదలు కావాల్సి ఉంది. ఈ సమయంలో వస్తున్న ఈ రూమర్స్ కలవర పెడుతున్నాయి. పవన్ రెండు పడవల ప్రయాణంతో దర్శక నిర్మాతలు నష్టపోతున్నారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

చిరంజీవి సినిమా హిట్ అని చెప్పుకున్నారు, కానీ అది ఫ్లాప్.. కుట్ర చేసినందుకు తగిన శాస్తి జరిగిందా ?
Top 10 Heroines : రష్మిక కు సమంత గండం, సినిమాలు లేకున్నా మొదటి స్థానంలో ఎలా? టాప్ 10 హీరోయిన్ల లిస్ట్ ఇదే?