కాంతార 6 డేస్ కలెక్షన్స్... ఇప్పటికి వరకు ఎంత లాభం అంటే!

By Sambi ReddyFirst Published Oct 21, 2022, 12:12 PM IST
Highlights


తెలుగు స్టేట్స్ లో కాంతార వసూళ్ల వర్షం కురిపిస్తుంది. ఆరు రోజులకు కాంతార ఐదు రెట్ల లాభాలు రాబట్టింది. తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేసిన అల్లు అరవింద్ భారీగా లాభాలు ఆర్జిస్తున్నారు. 
 

హీరో రిషబ్ శెట్టి ఒక్క సినిమాతో నేషనల్ వైడ్ పాప్యులర్ అయ్యారు. విడుదలైన అన్ని భాషల్లో కాంతార విశేష ఆదరణ దక్కించుకుంటుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం సంచలనాలు నమోదు చేస్తుంది. ఊహించని వసూళ్లు రాబడుతుంది. ఎలాంటి స్టార్ క్యాస్ట్ లేకుండా తెరకెక్కిన కాంతార కేవలం కంటెంట్ తో ప్రేక్షకులను ఆకర్షిస్తుంది. ఏపీ/తెలంగాణలలో కాంతార థియేటర్స్ ప్రేక్షకులతో కళకళలాడుతున్నాయి. 

మరోవైపు కాంతార చిత్ర తెలుగు హక్కులు సొంతం చేసుకున్న అల్లు అరవింద్ జేబులు నిండుతున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటి వరకు కాంతార రూ. 8 కోట్లకు పైగా లాభాలు నమోదు చేసింది. నిలకడగా ఉన్న వసూళ్లు వర్కింగ్ డేస్లో కూడా నెమ్మదించడం లేదు. ఇక ఆరు రోజులకు ఏపీ/తెలంగాణా కలిపి రూ. 10.61 కోట్ల షేర్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు రిపోర్ట్ చేశాయి. కాంతార చిత్రాన్ని అల్లు అరవింద్ రూ. 2 కోట్లకు దక్కించుకున్నాడు. 

రెండో వారంలో అడుగుపెట్టిన ఈ చిత్ర వసూళ్లు కొనసాగుతున్నాయి. నేడు నాలుగు కొత్త చిత్రాలు విడుదలైనా కూడా వాటికంటే కాంతార అడ్వాన్స్ బుకింగ్స్ మెరుగ్గా ఉన్నాయి. ఈ క్రమంలో ఈ వారం కూడా హవా కాంతారదే అనిపిస్తుంది. గాడ్ ఫాదర్ చిత్రాన్ని సైతం కాంతార దెబ్బతీసింది. హీరో రిషబ్ శెట్టి రచించి, దర్శకత్వం వహించి నటించాడు. కేజిఎఫ్ నిర్మాతలు ఈ చిత్రాన్ని నిర్మించారు. కాంతార ఫైనల్ రన్ ముగిసే నాటికి రికార్డు వసూళ్లు సాధించడం ఖాయంగా కనిపిస్తుంది. 

కాంతార 6 రోజుల వసూళ్లు.... 

Day 1: ₹2.1 కోట్లు 
Day 2: ₹2.75 కోట్లు 
Day 3: ₹1.9 కోట్లు 
Day 4: ₹1.45 కోట్లు 
Day 5: ₹1.36 కోట్లు 
Day 6: ₹1.1 కోట్లు 

ఏపీ/తెలంగాణా షేర్ : ₹10.61 కోట్లు 

click me!