మహేష్‌-త్రివిక్రమ్‌ సినిమా అప్‌డేట్‌.. పూజా షూటింగ్‌లో జాయిన్‌ అయ్యేది అప్పుడే.. ?

Published : Dec 10, 2022, 09:48 AM ISTUpdated : Dec 10, 2022, 02:35 PM IST
మహేష్‌-త్రివిక్రమ్‌ సినిమా అప్‌డేట్‌..  పూజా షూటింగ్‌లో జాయిన్‌ అయ్యేది అప్పుడే.. ?

సారాంశం

మహేష్‌బాబు, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న విసయం తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్‌లో హీరోయిన్‌ పూజాహెగ్డే పాల్గొనేందుకు టైమ్‌ ఫిక్స్ అయ్యింది. 

మహేష్‌బాబు-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్‌. `అతడు`, `ఖలేజా` తర్వాత మహేష్‌-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా కావడంతో దీనిపై ఆసక్తి, అంచనాలు నెలకొన్నాయి. పైగా `అల వైకుంఠపురములో` వంటి బ్లాక్‌ బస్టర్‌ తర్వాత మాటల మాంత్రికుడు రూపొందిస్తున్న సినిమా కావడం కూడా ఈ అంచనాలు పెరగడానికి ఓ కారణం కావచ్చు. మరోవైపు `మహర్షి` తర్వాత మహేష్‌, పూజా మరోసారి సిల్వర్‌ స్క్రీన్‌పై మెస్మరైజ్‌ చేయబోతున్నారు. 

ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్‌కి కొంత గ్యాప్‌ ఇచ్చారు. మహేష్‌ ఇంట్లో వరుస విషాదాల నేపథ్యంలో షెడ్యూల్ని వాయిదా వేశారు. ఇటీవల సూపర్‌స్టార్‌ కృష్ణ కన్నుమూసిన విషయం తెలిసిందే. అంతకు ముందు మహేష్‌ తల్లి ఇందిరా దేవి మరణించారు. ఆ బాధ నుంచి ఇప్పుడిప్పుడే మహేష్‌ బయటపడుతున్నారు. ఇటీవలే ఆయన ఓ యాడ్‌ షూటింగ్‌లో పాల్గొన్నారు. ఇప్పుడు సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారట. డిసెంబర్‌లోనే షూటింగ్ స్టార్ట్ చేయాలనుకున్నారు. డిసెంబర్ 15 నుంచి పూజా హెగ్డే కూడా షూటింగ్‌లో జాయిన్‌ అవుతుందని తెలిసింది. 

కానీ శనివారం టీమ్‌ నిర్ణయం మారిపోయింది. జనవరి నుంచి కొత్త షెడ్యూల్‌ ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. దీంతో పూజా డిసెంబర్‌ డేట్స్ క్యాన్సిల్‌ చేశారు. జనవరి షెడ్యూల్‌లో ఆమె పాల్గొనే ఛాన్స్ ఉందట.. కీలక సన్నివేశాల్లో పూజా పాల్గొనబోతుందని తెలుస్తుంది. హైదరాబాద్‌లో ఈ షెడ్యూల్‌ జరగనుందని సమాచారం. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి ఓ షెడ్యూల్‌ని పూర్తి చేశారు. యాక్షన్‌ ఎపిసోడ్లని తెరకెక్కించారు. ఇప్పుడు రెండో షెడ్యూల్‌కి సంబంధించిన పనులు జరుగుతున్నట్టు సమాచారం. హారికా అండ్‌ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్‌. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీలా సెకండ్‌ హీరోయిన్‌గా నటిస్తుందట. అలాగే రష్మిక మందన్నా ఓ స్పెషల్‌ సాంగ్‌ని కూడా ప్లాన్‌ చేస్తున్నారని టాక్. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Illu Illalu Pillalu Today Episode Dec 10: అమూల్యకు విశ్వ ఉత్తరం.. నర్మద, ప్రేమ చేతికి చేరిన లెటర్
Aishwarya Rai: రెండు కోలుకోలేని తప్పులు చేసిన ఐశ్వర్యా రాయ్‌.. సౌత్‌లో రెండు ఇండస్ట్రీ హిట్లు మిస్‌