హరిహరవీరమల్లు కు లైన్ క్లియర్...? షూటింగ్ పై తాజా అప్ డేట్.. పవర్ స్టార్ కరుణించేనా..?

Published : Jul 09, 2023, 04:04 PM IST
హరిహరవీరమల్లు కు లైన్ క్లియర్...? షూటింగ్ పై తాజా అప్ డేట్.. పవర్ స్టార్ కరుణించేనా..?

సారాంశం

ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు అయిపోయింది హరిహరవీరమల్లు సినిమా షూటింగ్ పరిస్థితి. పవర్ స్టార్ ఎప్పుడు కరుణిస్తాడా..? అని ఎదరు చూస్తున్నారు మేకర్స్.. ఇక తాజాగా ఈమూవీకి సంబంధించిన ఓ అప్ డేట్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా పీరియాడికల్ యాక్షన్ డ్రామా కథతో తెరకెక్కుతోన్న సినిమా హరిహర వీరమల్లు.  నిధి అగర్వాల్ హీరోయిన్ గా విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న.. ఈ భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా షూటింగ్ పై.. ఇంత వరకూ ఎటువంటి అప్ డేట్ రాలేదు. చాలా వరకూ షూటింగ్ కంప్లీట్ అయినా..? మేజర్ పార్ట్ మిగిలిపోయినట్టు తెలుస్తోంది. అయితే ఈ సినిమా కోసం పవర్ స్టార్  ఎప్పుడు డేట్స్ ఇస్తాడా అని అంతా ఎదరు చూస్తున్నారు. కాని ఈ మూవీ షూటింగ్ ఎప్పుడు ఉంటుందో తెలియక అంతా కన్ ఫ్యూజన్ లో పడిపోయారు. హరిహర వీరమల్లు రిలీజ్ సంగతి పక్కన పెడితే.. అసలు షూటింగ్ ఎప్పుడు ఉంటుందో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. 

అటు పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ పాలిటిక్స్ లో బిజీ అయిపోయాడు. ఈమధ్య ఓ నెల రోజులు షూటింగ్స్ కోసం టైమ్ కేటాయించినా..ఇతర సినిమాలకు టైమ్ కేటాయించిన పవర్ స్టార్ హరిహర వీరమల్లుకు మాత్రం పెద్దగా సమయం ఇవ్వలేకపోయాడు. ఈలోపు పొలిటికల్ ప్రెజర్స్ ఎక్కువ అవ్వడంతో..  వారాహీ యాత్ర కోసం ఆంధ్రాకు బయలుదేరాడు పవర్ స్టార్. ఈసినమా తరువాత స్టార్ట్ చేసిన బ్రో  లాంటి సినిమాలు కంప్లీట్ అయ్యాయి కాని హరిహరవీరమల్లు మాత్రం ఎక్కడ వేసిన గొంగళిఅక్కడే అన్నట్టు ఆగిపోయి ఉంది. 

కాని ఇతర సినిమాల షూటింగ్ కి.. హరిహరవీరమల్లు షూటింగ్ కు చాలా తేడా ఉంది. ఈమూవీ పీరియాడికల్ స్టోరీ కావడంతో.. షూటింగ్ కు ఎక్కువ సమయం పడుతుంది. ఎక్కు షార్ట్స్ కావాలి. యాక్షన్ సీక్వెన్స్ లు..మేకప్ , గెటప్ ఇలా చాలా కారణాల వల్ల ఈసినిమా ను వాయిదా వేస్తూ వస్తున్నాడు పవన్. ఇక తాజా సమాచారం ప్రకారం పవర్ స్టార్ త్వరలోనే ఈసినిమా కోసం ప్రత్యేకంగా టైమ్ కేటాయించబోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వారాహీ యాత్ర విషయంలో జోరు చూపిస్తున్నాడు పవర్ స్టార్. ఎలక్షన్స్  విషయంలో ముందస్తు అనుమానాలు ఉండటంతో.. ఆయన సడెన్ గా జనాల్లోకి వెళ్ళిపోయారు. త్వరలో వీలు చూసుకుని హరిహర వీరమల్లును కంప్లీట్ చేస్తానన్నారట పవర్ స్టార్. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?