
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ హిస్టారికల్ సినిమా హరిహర వీరమల్లు. ఈ మూవీ షూటింగ్ చాలా వరకూ పెండింగ్ ఉంది. ఇంత వరకూ పెద్దగా ముందుకు కదిలింది లేదు సినిమా. ఈమూవీ కోసం వేసిన సెట్లు కూడా పాడైపోయాయి. ఇక ఫిక్న్ కథతో..డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోన్న ఈసినిమాపై రకరకాల రూమర్లు వినిపనిస్తున్నాయి. ఈ మూవీలో పవన్ చేయాలి అటే హడావిడి లేకుండా ఉండాలి. ప్రశాంతంగా షూటింగ్ చేసుకోవాలి.. మేకప్.. యాక్షన్ సీన్స్ ఇవన్నీ టైమ్ పడతాయట. దాంతో పవన్ ఈమూవీ షైూటింగ్ ను పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నట్టు తెలుస్తోంది.
అందులోను పవర్ పొలిటికల్ ప్రెజర్ లో ఉన్నాడు. అలాంటప్పుడు సినిమాలు చేసినా.. ఏవైనా సింపుల్ గా అయిపోయే సినిమాలు చేయాలని అలా చేస్తేనే బాగుంటుంది అని అనకుంటున్నాడట. అందుకే ఈ టైట్ షెడ్యూల్ లో కూడా బ్రో మూవీ కంప్లీట్ చేశాడు..ఓజీకి కూడా టైమ్ ఇచ్చాడు. కాని హరిహర వీరమల్లు మాత్రం అలాగే పెండింగ్ పడిపోతూ ఉంది షూటింగ్. ఇక ఈసినిమాపై వచ్చే రూమర్స్ కు చెక్ పెట్టారు నిర్మాత ఏ ఎమ్ రత్నం.
ఈమధ్య కాలంలో పాన్ ఇండియా క్రేజ్ తో పాటు.. రెండు భాగాలుగా సినిమాలు తెరకెక్కించడం ట్రెండ్ గా మారింది. గతంలోనే ఈ ఆలోచనలు ఉన్నా..సాహసం చేయలేకపోయారు మేకర్స్. కాని బాహుబలి రెండు భాగాలుగా వచ్చిన తరువాత.. ధైర్యంగా భారీ బడ్జెట్ తో రెండు భాగాలుగా సినిమాలు చేస్తున్నారు. అలా వచ్చినవే.. బాహుబలి, KGF, పొన్నియన్ సెల్వన్, పుష్ప, సలార్ లాంటి సినిమాలు అలా వచ్చినవే ఈక్రమంలా ఆ స్ట్రాటజీని ఫాలో అయ్యే సినిమాల లిస్ట్ లో ఇప్పుడు 'హరి హర వీరమల్లు మూవీ కూడా చేరింది. హరిహరవీరమల్లు సినిమా గురించి తాజాగా అప్ డేట్ ఇచ్చారు నిర్మాత ఏఎం రత్నం.
ఏఎం రత్నం మాట్లాడుతూ.. ''హరి హర వీరమల్లు అనేది చాలా పెద్ద సినిమా. భారీ స్థాయిలో రూపొందే పీరియాడిక్ మూవీ. పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో ఉన్నారు కాబట్టి ఒకేసారి డేట్స్ అన్నీ ఇచ్చినా ఈ సినిమా చేయలేం. ఎందుకంటే ఇది రెగ్యులర్ గా తీసే సినిమా కాదు. భారీ సెట్స్ వెయ్యాలి. చాలా గ్రాఫిక్ వర్క్ ఉంటుంది. చాలా పని ఉంటుంది. సినిమాలు చేసిన డబ్బులను పాలిటిక్స్ లో ఖర్చు పెడుతున్నాని పవన్ స్వయంగా చెప్పారు.
అందుకే ప్యారలల్ గా తక్కువ రోజుల్లో అయిపోయే కొన్ని రీమేక్స్ చేస్తున్నారు. ఈ ఇయర్ ఎడింగ్ లోపు మా సినిమా షూటింగ్ ఫినిష్ చేస్తాం. వచ్చే ఏడాది ఎలక్షన్స్ కంటే ముందే చిత్రాన్ని విడుదల చేస్తాం'' అని అన్నారు. అంతేకాదు ఈ మూవీ 2 పార్ట్స్ గా రావొచ్చని, ఈ సబ్జెక్ట్ మన కంటే నార్త్ వాళ్లకి బాగా కనెక్ట్ అవుతుందని ఆయన అన్నారు. ఈసినిమా రెండు భాగాలుగా రాబోతుందని తెలిసి పవన్ ఫ్యాన్స్ దిల్ ఖుష్ అవుతున్నారు. భారీ ఎత్తున ఈసినిమాను రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు ఆయన మాటల్లోనే తెలుస్తోంది. బడ్జెట్ కూడా భారీగా పెరగబోతుందట.