అల్లు అర్జున్ ఒక్కడినే తప్పుపట్టలేం, గతంలో చిరంజీవి గారు ఎలా చేశారంటే.. సంధ్య థియేటర్ ఘటనపై తొలిసారి పవన్

By tirumala AN  |  First Published Dec 30, 2024, 2:17 PM IST

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంగళగిరిలో మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ చిట్ చాట్ లో పవన్ కళ్యాణ్ తొలిసారి అల్లు అర్జున్ వివాదం గురించి డీటైల్డ్ గా మాట్లాడారు.


రీసెంట్ గా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కడపలో పర్యటించారు. ఆ సందర్భంలో మీడియా ప్రతినిధులు అల్లు అర్జున్, సంధ్య థియేటర్ వివాదం గురించి ప్రశ్నించారు. దీనితో పవన్ కళ్యాణ్ ఇక్కడ సమస్య వేరు.. ఇది సందర్భం కాదు అని బన్నీ గురించి స్పందించలేదు. కాగా నేడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంగళగిరిలో మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ చిట్ చాట్ లో పవన్ కళ్యాణ్ తొలిసారి అల్లు అర్జున్ వివాదం గురించి డీటైల్డ్ గా మాట్లాడారు. జరిగిన తప్పులని ఎత్తిచూపుతూ ఈ వివాదంలో అల్లు అర్జున్ ఒక్కడినే దోషిని చేయడం కరెక్ట్ కాదు అని అన్నారు. 

రేవంత్ రెడ్డిపై పవన్ ప్రశంసలు 

డిప్యూటీ సీఎం ఏమన్నారో వివరాల్లో చూద్దాం. ముందుగా పవన్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గురించి, టాలీవుడ్ కి ఆయన అందించిన సహకారం గురించి మాట్లాడారు. రేవంత్ రెడ్డి కింది స్థాయి నుంచి ఎదిగిన గొప్ప నాయకుడు అని పవన్ కళ్యాణ్ ప్రశంసించారు. చిత్ర పరిశ్రమ విషయంలో ఆయన వైసిపి తరహాలో వ్యవహరించలేదు. బెనిఫిట్ షోలకు, టికెట్ ధరలు పెంచుకునేందుకు వీలు కల్పించారు. దీనితో సలార్ లాంటి చిత్రాలకు భారీ వసూళ్లు వచ్చాయి. పుష్ప 2 చిత్రానికి కూడా రేవంత్ రెడ్డి సహకరించారు. టికెట్ ధరలు పెంచుకునే వీలు కల్పించడం కూడా చిత్ర పరిశ్రమ ఎదుగుదలకి సహకారం అందించడమే అవుతుంది. 

Latest Videos

Also Read : పుష్ప 2 లాభాల్లో భారీ మొత్తం నిర్మాతలకు కోత.. అల్లు అర్జున్ క్రేజ్ ఇక్కడ పనిచేయలేదా ?

అయితే సంధ్య థియేటర్ ఘటనలో పూర్తిగా ఏం జరిగిందో నాకు సమాచారం లేదు. ఎలాంటి సంఘటన జరిగినా పోలీసు వారి చర్యలు ఉంటాయి. పోలీసులు ఎక్కడైనా భద్రత ఇవ్వడానికే ప్రయత్నిస్తారు. వారిని కూడా తప్పు పట్టకూడదు. కానీ థియేటర్ యాజమాన్యం అల్లు అర్జున్ కి ముందే సమాచారం ఇవ్వాల్సింది. థియేటర్ కి వచ్చి సీట్లో కూర్చున్న తర్వాత అయినా అల్లు అర్జున్ కి పరిస్థితి వివరించి అక్కడి నుంచి పంపించాల్సింది. 

అక్కడే తప్పు జరిగింది 

గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకు తీసుకుని వచ్చారు. రేవతి మరణించడం నన్ను తీవ్రంగా బాధించింది. ఆమె మరణం గురించి తెలిసిన వెంటనే అల్లు అర్జున్ తరుపున ఎవరో ఒకరు కుటుంబాన్ని స్వయంగా పరామర్శించి ధైర్యం చెప్పి ఉండాల్సింది. ఇక్కడే మానవతా కోణంలో తప్పు జరిగింది అనిపిస్తోంది. రేవతి కుటుంబాన్ని ఎవరూ పరామర్శించకపోవడం వల్ల ప్రజల్లో ఆగ్రహం తలెత్తింది. రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో మాట్లాడారు. 

అల్లు అర్జున్ ఒక్కడినే తప్పు పట్టలేం 

తనవల్ల ఒక వ్యక్తి చనిపోయారనే వేదన అల్లు అర్జున్ లో ఉంది. సీఎం రేవంత్ రెడ్డి పరిస్థితులని బట్టి నిర్ణయాలు తీసుకున్నారు. కానీ ఇక్కడ అల్లు అర్జున్ ఒక్కడినే తప్పుపట్టలేం. గతంలో చిరంజీవి గారు కుడి థియేటర్ కి వెళ్లి సినిమాలు చూసేవారు. చిరంజీవి గారు మాస్క్ ధరించి ఒక్కరే థియేటర్ కి వెళ్లి సినిమా చూసి వచ్చేవారు అని పవన్ కళ్యాణ్ తెలిపారు. 

Also Read : రాంచరణ్, బాలయ్య ఫ్యాన్స్ టెన్షన్ మొత్తం అంజలి, శ్రద్దా శ్రీనాథ్ పైనే.. వందల కోట్ల బిజినెస్ కి వాళ్లే కీలకం

సంధ్య థియేటర్ సంఘటన తర్వాత అల్లు అర్జున్ ని పోలీసులు ఎ 11 నిందితుడుగా చేర్చి అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అల్లు అర్జున్ బెయిల్ పై విడుదలయ్యారు. బెయిల్ పై విడుదలయ్యాక పోలీసులు అల్లు అర్జున్ ని విచారించిన సంగతి తెలిసిందే. రేవంతి కుటుంబానికి అల్లు అర్జున్ భారీ మొత్తంలో ఆర్థిక సాయం ప్రకటించారు. 

click me!