'అరవింద సమేత'కి పవన్ ఫ్యాన్స్ సపోర్ట్.. కారణమదేనా..?

Published : Oct 04, 2018, 11:38 AM IST
'అరవింద సమేత'కి పవన్ ఫ్యాన్స్ సపోర్ట్.. కారణమదేనా..?

సారాంశం

'అరవింద సమేత' సినిమా ట్రైలర్ విడుదలై యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తోంది. దీని వెనుక ఎన్టీఆర్ అభిమానులతో పాటు పవన్ కళ్యాణ్ అభిమానుల హస్తం కూడా ఉందని టాక్. 'అరవింద సమేత' ప్రీరిలీజ్ వేడుకలో ఎన్టీఆర్ స్పీచ్ విన్న తారక్ అభిమానులు ఎంతో ఎమోషనల్ అయ్యారు. 

'అరవింద సమేత' సినిమా ట్రైలర్ విడుదలై యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తోంది. దీని వెనుక ఎన్టీఆర్ అభిమానులతో పాటు పవన్ కళ్యాణ్ అభిమానుల హస్తం కూడా ఉందని టాక్. 'అరవింద సమేత' ప్రీరిలీజ్ వేడుకలో ఎన్టీఆర్ స్పీచ్ విన్న తారక్ అభిమానులు ఎంతో ఎమోషనల్ అయ్యారు.

అయితే ఈ స్పీచ్ తో పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా తారక్ ని సపోర్ట్ చేస్తూ మీకు మేమున్నాం అంటూ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. సాధారణంగా ఒక టాప్ హీరో సినిమాలకు సంబంధించిన ట్రైలర్ ని మరో టాప్ హీరో అభిమానులు సపోర్ట్ చేయడం అరుదుగా జరుగుతుంది. 

'అరవింద సమేత' సినిమా విషయంలో పవన్ ఫ్యాన్స్ తారక్ కి సపోర్ట్ చేస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు. సినిమా ట్రైలర్ ని ఆకాశానికేత్తేస్తూ కామెంట్స్ పెడుతున్నారు. దీని వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయనే మాటలు బలంగా వినిపిస్తున్నాయి. రానున్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమరంలో టీడీపీ కి ప్రచారం కల్పించడానికి ఎన్టీఆర్ ని రంగంలోకి దింపబోతున్నారని వార్తలు వస్తున్నాయి.

ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ కి తారక్ నుండి విమర్శలు రాకుండా తప్పించడానికే ఇలా తారక్ ని పొగుడుతూ సపోర్ట్ ఇస్తున్నారని టాక్. ఇవన్నీ పక్కన పెడితే.. 'అరవింద సమేత'కి తారక్ ఫ్యాన్స్ తో పాటు పవన్ ఫ్యాన్స్ కూడా తోడైతే ఇక రికార్డుల మోతమోగడం ఖాయం!

సంబంధిత వార్తలు.. 

'అరవింద సమేత'లో నో ఫన్.. ఓన్లీ యాక్షన్!

'అరవింద సమేత' ట్రైలర్.. యూట్యూబ్ లో రికార్డుల మోత!

ఎన్టీఆర్ ఫ్యాన్స్ పై 'అరవింద సమేత' హీరోయిన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

మా నాన్నకిచ్చిన మాట మీకిస్తున్నా.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్!

జీవితంలో కూడా నిజమైన హీరో ఎన్టీఆర్.. త్రివిక్రమ్ కామెంట్స్!

కళ్యాణ్ రామ్ స్పీచ్ తో ఏడ్చేసిన ఎన్టీఆర్!

PREV
click me!

Recommended Stories

korean kanakaraju Day 7 collections: వరుణ్ తేజ్ మూవీకి ఎదురుదెబ్బ, కొరియన్ కనకరాజు వారంలో ఎంత వసూలు చేసింది?
Bigg Boss Agnipariksha: బిగ్ బాస్ కు శాపం పెట్టిన ఉప్పల్ బాలు, పిలిచి అవమానిస్తారా అంటూ.. నవదీప్ పై ఫైర్