షారుఖ్ మర్యాదలేని మనిషి.. స్టార్ హీరోపై సింగర్ సంచలన వ్యాఖ్యలు!

Published : Oct 04, 2018, 11:00 AM IST
షారుఖ్ మర్యాదలేని మనిషి.. స్టార్ హీరోపై సింగర్ సంచలన వ్యాఖ్యలు!

సారాంశం

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కి ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఆ క్రేజ్ మొత్తం తన వల్లే వచ్చిందని అంటున్నాడు బాలీవుడ్ సిందర్ అభిజీత్ భట్టాచార్య. బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ పాటలను పాడిన అభిజీత్.. షారుఖ్ పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

''1990లలో షారుఖ్ నటించిన సినిమాలకు పాటలు పాడాను. అప్పుడు చాలా మంది నా గొంతు, షారుఖ్ గొంతు ఒకేలా ఉందని అనేవారు. ఎంతపెద్ద స్టార్ హీరో అయినా వారి సినిమాలలో పాటలు నేనే పాడేవాడిని. అలా నా గొంతుతో ఎందరినో స్టార్ హీరోలుగా మార్చాను. నేను షారుఖ్ సినిమాలకు పాటలు పాడుతున్నంత కాలం ఆయన ఓ రాక్ స్టార్ లా ఉండేవాడు.

ఎప్పుడైతే నేను అతడి కోసం పాడడం మానేశానో.. ఆయన క్రేజ్ బాగా తగ్గిపోయిందని'' అన్నారు. షారుఖ్ సినిమాలకు ఎందుకు పాడడం లేదనే కారణాన్ని ప్రస్తావిస్తూ.. ''షారుఖ్ నటించిన 'ఓం శాంతి ఓం','మైహూనా' సినిమాలలో పాటలు పాడాడు. సినిమా అయిపోయిన తరువాత టైటిల్స్ వేసినప్పుడు సినిమా కోసం పని చేసిన స్పాట్ బాయ్స్ పేర్లు కూడా 
వేశారు.

కానీ ప్రేక్షకులు థియేటర్ నుండి వెళ్లిపోతున్నారనే సమయంలో నా పేరుని వేశారు. పేరున్న ఏ సింగర్ అయినా.. తన పేరుని అలా చూడాలని అనుకోడు. ఏ మాత్రం మర్యాద లేని అలాంటి మనిషితో పని చేయకూడదని అనుకున్నాను'' అంటూ చెప్పుకొచ్చారు. 

PREV
click me!

Recommended Stories

Dhurandhar Collection: ధురంధర్‌ మూవీ ఫస్ట్‌ డే కలెక్షన్లు.. రణ్‌వీర్‌ సింగ్‌ సునామీకి బాక్సాఫీస్ షేక్
Pawan kalyan ఉదయ్ కిరణ్ కాంబినేషన్ లో మిస్సైన మల్టీ స్టారర్ మూవీ ఏదో తెలుసా?