Bheemla Nayak: ఫ్యాన్స్ ని కన్ఫ్యూజ్ చేస్తున్న భీమ్లా నాయక్.. క్లారిటీ కావాలంటూ డిమాండ్

Published : Jan 29, 2022, 03:08 PM IST
Bheemla Nayak: ఫ్యాన్స్ ని కన్ఫ్యూజ్ చేస్తున్న భీమ్లా నాయక్.. క్లారిటీ కావాలంటూ డిమాండ్

సారాంశం

భీమ్లా నాయక్ (Bheemal Nayak)విడుదల తేదీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని ఇరిటేషన్ కి గురిచేస్తుంది. రోజుకో రూమర్ ప్రచారం అవుతుండగా వాళ్ళ ఫ్రస్ట్రేషన్ పీక్స్ చేరుతుంది. అసలు భీమ్లా నాయక్ ఎప్పుడు వస్తుందో క్లారిటీ ఇవ్వండి అంటూ సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు.

పవన్ (Pawan Kalyan)ఫ్యాన్స్ అంటే వాళ్ళ ఇంటెన్సిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  ఆయన మూవీ అంటే చొక్కాలు చించుకుంటారు. పవన్ ని స్క్రీన్ పై చూడాలని ప్రతి ఫ్యాన్ ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. కాగా పవన్ లేటెస్ట్ భీమ్లా నాయక్ విడుదల విషయంలో కన్ఫ్యూషన్ కొనసాగుతుంది. నిజానికి భీమ్లా నాయక్ సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సింది. జనవరి 12 భీమ్లా నాయక్ రిలీజ్ కి సర్వం సిద్ధమైంది. ఆర్ ఆర్ ఆర్ మూవీ రూపంలో భీమ్లా నాయక్ అడ్డంకి ఏర్పడింది. 

ఆర్ ఆర్ ఆర్ జనవరి 7 తమ విడుదల తేదీగా ప్రకటించి భీమ్లా నాయక్ పోస్ట్ ఫోన్ అయ్యేలా ఒత్తిడి తెచ్చారు. భీమ్లా నాయక్ చిత్ర నిర్మాత నాగవంశీ చాలా రోజులు ఆర్ ఆర్ ఆర్ నిర్మాతల ఒత్తిడికి తలొగ్గలేదు. పెద్దల ప్రమేయంతో భీమ్లా నాయక్ విడుదల వాయిదా వేయక తప్పలేదు. తీరా ఆర్ ఆర్ ఆర్ వాయిదా పడడంతోవాళ్ళు చెడింది కాగా భీమ్లా నాయక్ బిజినెస్ ని కూడా దెబ్బకొట్టారు. 2022 సంక్రాంతి బరిలో ఒక్క పెద్ద చిత్రం కూడా లేదు. యావరేజ్ టాక్ తెచ్చుకున్న బంగార్రాజు సీజన్ క్యాష్ చేసుకుంది. 

సంక్రాంతి బరి నుండి తప్పుకున్న భీమ్లా నాయక్ ఫిబ్రవరి 25న విడుదల చేస్తున్నట్లు అధికారిక ప్రకటన చేశారు. ఫ్యాన్స్ మైండ్ లో ఈ డేట్ ఫిక్స్ అయిపోయింది.  మరలా భీమ్లా నాయక్ పోస్ట్ ఫోన్ అంటూ వార్తలు బయలుదేరాయి. మేకర్స్ దీనిపై ఎటువంటి ప్రకటన చేయకున్నా.. ఉహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. సోషల్ మీడియాలో భీమ్లా నాయక్ విడుదల తేదీపై పెద్ద చర్చ జరుగుతుండగా ఫ్యాన్స్ తమ అసహనం తెలియజేస్తున్నారు. 

మరోవైపు భీమ్లా నాయక్ అద్భుతంగా వచ్చిందన్న టాక్ వినిపిస్తుంది. సెన్సార్ కూడా పూర్తయినట్లు సమాచారం. అయితే చాలా తక్కువ నిడివితో భీమ్లా నాయక్ విడుదల చేస్తున్నారట. రెండు గంటల పది నిమిషాల నిడివి మాత్రమే ఉన్నట్లు వినికిడి. భీమ్లా నాయక్ మలయాళ హిట్ మూవీ అయ్యప్పనుమ్ కోశియుమ్ తెలుగు రిమేక్ గా తెరకెక్కుతుంది. 

దర్శకుడు సాగర్ కె చంద్ర తెరకెక్కిస్తుండగా... స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. రానా మరో హీరోగా నటిస్తున్నారు. నిత్యా మీనన్ మొదటిసారి పవన్ కి జంటగా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

వారణాసి లో మహేష్ బాబు తండ్రి పాత్రను మిస్సైన ముగ్గురు హీరోలు ఎవరో తెలుసా?
Illu Illalu Pillalu Today Episode Dec 16: అమూల్య ప్రేమ వేషాలు కళ్లారా చూసిన పెద్దోడు, నాన్నకి చెప్పేందుకు సిద్ధం