Mahesh Babu : కూతురితో కలిసి ఆటలో మునిగిన సూపర్ స్టార్.. క్లిక్కుమనిపించిన నమ్రత

Published : Jan 29, 2022, 02:06 PM IST
Mahesh Babu : కూతురితో కలిసి ఆటలో మునిగిన సూపర్ స్టార్..  క్లిక్కుమనిపించిన నమ్రత

సారాంశం

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ఫ్యామిలీకి ఎక్కువ టైమ్ కేటాయిస్తారు. భార్యా పిల్లలతో ఎక్కువటైమ్ గడుపుతుంటారు. వాటికి సబంధింన తీపి గురుతులను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు నమ్రత.

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ఫ్యామిలీకి ఎక్కువ టైమ్ కేటాయిస్తారు. భార్యా పిల్లలతో ఎక్కువటైమ్ గడుపుతుంటారు. వాటికి సబంధింన తీపి గురుతులను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు నమ్రత.

సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu)  ఫ్యామిలీకి ఇచ్చే ఇంపార్టెన్స్ గురించి అందరికీ తెలిసిందే. షూటింగ్ ఉంటే సెట్ లో.. లేకుండే ఇంట్లో.. అదీ కాకుండే ఫారెన్ టూర్ లో అది కూడా ప్యామిలీతోనే కలిసి వెళ్తుంటారు మహేష్(Mahesh Babu). ఫ్యామిలీలేకుండా ఒంటరిగా ఆయన కనిపించిన సందర్భాలు లేవసలు. ఇక వారి ఫ్యామిలీమూమెంట్స్ ను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తుంటారు ఆయన భార్య నమ్రత.

రీసెంట్ డేస్ లో కూడా చాలా మెమరీస్ ను ఆమె అభిమానులతో పంచుకున్నారు.  సూపర్ స్టార్ మహేష్ (Mahesh Babu)  రీసెంట్ గా కోవిడ్ నుంచి కోలుకున్నారు. అంతకు ముందు కాలికి సర్జరీ అవ్వడంతో రెస్ట్ లో ఉన్నారు. సర్కారువారి పాట షూటింగ్ కు కూడా  గ్యాప్ ఇచ్చిన మహేష్(Mahesh Babu)  కంప్లీట్ గా రెస్ట్ లో ఉన్నాడు. అన్న రమేష్ బాబు మరణంతో  మరికొంత గ్యాప్ వచ్చింది సూపర్ స్టార్ కు.

దాంతో ఆయన తన టైమ్ మొత్త ఇంట్లోనే పిల్లలతోనే గడిపేస్తున్నారు.రీసెంట్ గా మహేష్(Mahesh Babu),సితార కలిసి తమ పెట్ డాగ్ తో ఆడుకుంటుండ గా నమ్రత ఫోటో తీశారు. ఆ పిక్ ను సోషల్ మీడియాలో ఫోటోను శేర్ చేశారు. ఇలా ప్రతీ మూమెంట్ ను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటున్నారు నమ్రత. రీసెంట్ గా తన భర్త్ డే రోజు కూడా.. ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. వీటితో పాటు తన పిల్లలు సరదాగా చేసిన ప్రతీ పనీని ఫ్యాన్స్ తో శేర్ చేసుకోవడం అలవాటు సెలబ్రిటీకి.

 

ప్రస్తుతం సర్కారువారి పాట షూటింగ్ 30 శాతం పెడ్డింగ్ లో ఉంది. నెక్ట్స్ మన్త్ లో ఈషూటింగ్ ను కంప్లీట్ చేయాలి అని పిక్స్ అయ్యాడు సూపర్ స్టార్ మహేష్ (Mahesh Babu). వెంటనే త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram) సినిమాలో జాయిన్ అవ్వబోతున్నాడు. ఈ సినిమా కూడా ఆరు నెలల్లో కంప్లీట్ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు.ఏడాదికి ఒక్క సినిమా మాత్రమే చేసే మహేష్ బాబు 2021 లో కరోనా వల్ల సినిమాను రిలీజ్ చేయలేకపోయాడు. దాంతో ఈఏడాది రెండు సినిమాలు రిలీజ్ కు ప్లాన్ చేసుకుంటున్నట్టు సమాచారం.

PREV
click me!

Recommended Stories

Pawan Kalyan Gift: `ఓజీ` దర్శకుడికి పవన్‌ కళ్యాణ్‌ ఊహించని గిఫ్ట్.. సుజీత్‌ ఎమోషనల్‌
9 సినిమాలు చేస్తే.. అందులో 8 ఫ్లాప్‌లు.. పాన్ ఇండియా స్టార్‌పైనే ఆశలన్నీ.. ఎవరీ హీరోయిన్.?