Allu Arha : అల్లు అర్జున్ ను సర్ ప్రైజ్ చేసిన ‘అల్లు అర్హా’.. పట్టలేని ఆనందంలో ఐకాన్ స్టార్..

Sreeharsha Gopagani   | Asianet News
Published : Jan 29, 2022, 02:01 PM IST
Allu Arha : అల్లు అర్జున్ ను  సర్ ప్రైజ్ చేసిన ‘అల్లు అర్హా’.. పట్టలేని ఆనందంలో ఐకాన్ స్టార్..

సారాంశం

అల్లు అరవింద్ కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంటే ప్రాణం...  అల్లు అర్జున్ కు తన కూతురు ‘అల్లు అర్హా’ అంటే ప్రాణం. అయితే అల్లు అర్జున్ తన తండ్రిని సర్ ప్రైజ్ చేసినట్టే.. అర్హ కూడా తన తండ్రి అల్లు అర్జున్ ను సర్ ప్రైజ్ చేసింది..  

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) రీసెంట్ గా పుష్ప సినిమాతో సూపర్ హిట్ కొట్టారు. ఫస్ట్ టైమ్ పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ సాధించిన అల్లు అర్జున్(Allu Arjun). ఆ సక్సెస్ ను ఎంజాయ్ చేసే మూడ్ లో  దుబాయికి వెళ్లిన విషయం తెలిసిందే. 

పుష్ప సినిమాతో రికార్డ్ ల మీద రికార్డ్ లు క్రియేట్ చేశాడు బన్నీ. పాన్ ఇండియా రేంజ్ లో సూపర్ హిట్ అవ్వడంతో.. ఆ సక్సెస్ ను ఎంజాయ్ చేయడానికి దుబాయ్ లో 16 రోజులు గడిపాడు బన్నీ.. ఫ్యామిలీతో కలిసి సక్సెస్ ను సెలబ్రేట్ చేసుకుని తిరిగి హైదరాబాద్ కు చేరుకున్నాడు అల్లు అర్జున్ ..  ఈ సందర్భంగా చెట్లు ఆకులు, రోజ్ ఫ్లవర్ రెమ్మలతో ‘వెల్ కమ్ నాన్న’ అని రాసింది అల్లు అర్హా.

 

తన కూతురు తనపై చూపే ప్రేమకు తబ్బుబ్బిపోయాడు  ‘అల్లు అర్జున్’. 16 రోజులు తన దుబాయ్ లో పొందిన ఆనందం కంటే మించిన ఆనందం తన కూతురు ద్వారా లభించినట్టు అనుభూతి చెందాడు. అబ్రాడ్ నుంచి తిరిగి రాగానే ‘స్వీటెస్ట్ వెల్ కమ్’ లభించినట్టు పేర్కొన్నాడు బన్నీ. ఈ తండ్రీ కూతురు ప్రేమను చూసిన నెటిజన్లు కూడా ఎమోషనల్ గా ఫీలవుతున్నారు. గతంలోనూ అల్లు అర్జున్, అర్హా అల్లరి చేస్తూ.. కబుర్లు చెప్పుకుంటూ.. గేమ్స్ ఆడుకుంటూ కనిపించారు. అందుకు సంబంధించిన వీడియోలను ఎప్పటికప్పుడు బన్నీ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉన్నాడు. 

మరోవైపు సుకుమార్(Sukumar) డైరెక్షన్ లో.. అల్లు అర్జున్ Allu Arjun రఫ్ అండ్ రగ్డ్ లుక్ లో.. రష్మిక మందన్న హీరోయి గా నటించిన పుష్ప సినిమా పరంగానే కాకుండా పాటల పరంగా కూడా దూసుకుపోయింది. ఇప్పటికీ ఏదో ఒక రకంగా ఈ మూవీ  సోషల్ మీడియాలో సందడి చేస్తూనే ఉంది. దేశవ్యాప్తంగా స్టార్స్ ను ఆకట్టుకున్న పుష్ప.. ప్రపంచ వ్యాప్తంగా కూడా ఆకర్షించింది.  స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ లాంటి వారే.. పుష్ప పాటలకు ఫిదా అయిపోయారు.  
 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Pawan Kalyan Gift: `ఓజీ` దర్శకుడికి పవన్‌ కళ్యాణ్‌ ఊహించని గిఫ్ట్.. సుజీత్‌ ఎమోషనల్‌
9 సినిమాలు చేస్తే.. అందులో 8 ఫ్లాప్‌లు.. పాన్ ఇండియా స్టార్‌పైనే ఆశలన్నీ.. ఎవరీ హీరోయిన్.?