కల్కి థియేటర్ వద్ద అకీరాకు చెమటలు పట్టించిన ఫ్యాన్స్... భయంతో పరుగులు!  

Published : Jun 27, 2024, 06:49 PM ISTUpdated : Jun 27, 2024, 06:58 PM IST
కల్కి థియేటర్ వద్ద అకీరాకు చెమటలు పట్టించిన ఫ్యాన్స్... భయంతో పరుగులు!  

సారాంశం

కల్కి మూవీ చూసేందుకు ఏకంగా లోగో ఉన్న టీ షర్ట్ ధరించి ప్రభాస్ సినిమా చూసేందుకు వెళ్ళాడు పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్. ఫ్యాన్స్ అతన్ని భయపెట్టేశాడు. అకీరా పరుగులు తీశాడు...   

పవన్ కళ్యాణ్ వారసుడిగా అకీరా నందన్ కు భారీ ఫాలోయింగ్ ఉంది. అతడు పబ్లిక్ లో కనిపిస్తే మీడియా, అభిమానులు ఫోటోల కోసం ఎగబడతారు. ఈ మధ్య అకీరా మీడియాలో తరచుగా కనిపిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా మొదటిసారి గెలిచాడు. డిప్యూటీ సీఎం, మంత్రి కూడా అయ్యాడు. ఎన్డీయే కూటమిలో జనసేన భాగస్వామిగా ఉన్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీని పవన్ కళ్యాణ్ పలుమార్లు కలిశాడు. ప్రధానిని కలిసేందుకు కొడుకు అకీరాను వెంట తీసుకుని వెళ్ళాడు.

ప్రధానితో అకీరా ఉన్న ఫోటోలు వైరల్ అయ్యాయి. అలాగే పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి చెల్లి ఆద్యతో పాటు అకీరా హాజరయ్యాడు. టీనేజ్ దాటిన అకీరా హీరోగా ఎంట్రీగా ఇచ్చేందుకు సిద్ధమంటూ వార్తలు వస్తున్నాయి. అందులోనూ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న పవన్ కళ్యాణ్ రాజకీయంగా బిజీ అయ్యాడు. అకీరా ఎంట్రీకి ఇదే సరైన సమయమన్న వాదన వినిపిస్తుంది. 

ఇదిలా ఉంటే కల్కి 2829 AD నేడు విడుదలైంది. ఈ మూవీ మొదటిరోజు చూసేందుకు మిత్రులతో అకీరా థియేటర్ కి వచ్చాడు. అనూహ్యంగా అకీరా ప్రభాస్ కల్కి లోగో టీ షర్ట్ ధరించి ఉన్నాడు. అకీరాను చూసిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అతడిని వెంబడించారు. నువ్వు మా దేవుడు... జై అకీరా అంటూ నినాదాలు చేశారు. వారి నుండి తప్పించుకునేందు అకీరా పరుగున థియేటర్ లోకి పరుగెత్తాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. 

పవన్ కళ్యాణ్ అభిమానుల పిచ్చి చూస్తుంటే... అకీరాను స్టార్ హీరో చేసే వరకు నిద్రపోయేలా లేరు. అకీరా ఆసక్తి ఏమిటో ఇంకా తెలియదు. రేణు దేశాయ్ మాత్రం అతడి ఇష్టం మేరకే ఏదైనా అంటుంది. అకీరా ఫిల్మ్ మేకింగ్ లో శిక్షణ తీసుకున్నాడు. మ్యూజిక్ లో కూడా ప్రావీణ్యం ఉంది. మొత్తంగా అకీరా ఫాలోయింగ్ మైండ్ బ్లాక్ అవుతుంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Rithu Chowdary: అంతా నా కర్మ, మోసం చేసి మరో అమ్మాయితో వెళ్ళిపోయాడు.. కెరీర్ కోసమే నవ్వుతూ బతుకుతున్నా
Parthiban Controversy:చిక్కుల్లో పడ్డ ఉస్తాద్ విలన్.. పవన్ కళ్యాణ్ ముందే అలాంటి వ్యాఖ్యలు, వైరల్