`కల్కి 2898ఏడీ` సినిమాకి వెళ్తున్నారా?.. అయితే బాలయ్య చెప్పిన ఈ మాటలు వినాల్సిందే!

By Aithagoni RajuFirst Published Jun 26, 2024, 6:15 PM IST
Highlights

రేపు ప్రభాస్‌ నటించిన `కల్కి` సినిమా విడుదల నేపథ్యంలో బాలకృష్ణ పాత వీడియో వైరల్‌ అవుతుంది. `కల్కి`కి వెళ్తున్నారా? అయితే దీన్ని చూడండి అంటున్నారు నెటిజన్లు. 
 

ప్రభాస్‌  నటించిన `కల్కి 2898ఏడీ` కోసం లక్షలాది మంది ఆడియెన్స్ వెయిట్‌ చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు చూద్దామని ఈగర్‌గా ఉన్నారు. అడ్వాన్స్ బుకింగ్‌లు కూడా స్టార్ట్ అయ్యాయి. ఓవర్సీస్‌లో బుకింగ్స్ లో `కల్కి` దుమ్ములేపుతుంది. తొలి రోజు ఈ మూవీ ఎంతటి భారీ ఓపెనింగ్స్ రాబడుతుందో ఇప్పట్నుంచే లెక్కలు వేస్తున్నారు ట్రేడ్‌ పండితులు. ఈ క్రమంలో ఈ సినిమా ఎలా ఉండబోతుందో అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. 

ఇదిలా ఉంటే ఇప్పటి వరకు విడుదలైన సినిమా కంటెంట్‌ ప్రారంభంలో కన్‌ఫ్యూజన్‌ క్రియేట్‌ చేస్తే, రెండో ట్రైలర్‌ మాత్రం కాస్త ఎమోషనల్‌గా అనిపించింది. అంచనాలను పెంచింది. ఈ నేపథ్యంలో సినిమా కోసం అంతా ఈగర్‌గా ఉన్నారు. ఒక్క రోజులో ఈ సినిమా ఫలితం తేలబోతుంది. రేపు భారీ స్థాయిలో `కల్కి` విడుదల కాబోతుంది. అయితే చాలా మందినిఓ కన్‌ఫ్యూజన్‌ వెంటాడుతుంది.  మైథలాజికల్‌ అంశాలకు, సైన్స్ ఫిక్షన్‌కి ముడిపెట్టి తీసిన సినిమా కావడంతో ఎలా ఉంటుందనేది, అలాగే మహాభారతంలోని పాత్రలను ఇందులో చూపించబోతున్నారు. 

Latest Videos

విష్ణువు నుంచి, అశ్వత్థామ, అర్జునుడు, వంటి చాలా పాత్రలను ఇందులో చూపిస్తారట. మరి ఆ పాత్రలేంటి? ఆ పాత్రలకు ఉన్న రిలేషన్‌ ఏంటి? ఇందులో ఎలా చూపిస్తాడనేది అందరిని వెంటాడుతున్న ప్రశ్న. దీనికి సంబంధించి బాలకృష్ణ వీడియో వైరల్ అవుతుండటం విశేషం. బాలయ్య తెలుగు సినిమా ఈవెంట్‌లో మహాభారతంలోని పాత్రలన్నింటి గురించి చెబుతూ, ఓ స్కిట్‌ చేశారు. అది ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. `మీరు `కల్కి 2898ఏడీ` సినిమాకు వెళ్తున్నారా? అయితే ఈ వీడియో వింటే మహాభారతంలోని పాత్రలకు సంబంధించి ఓ క్లారిటీ వస్తుందని చెబుతూ నెటిజన్లు దీన్ని వైరల్‌ చేస్తున్నారు. మరి అదేంటో మీరు ఓలుక్కేయండి? 

Kalki movie ki velletappudu balayya cheppina mythology character names vinte oka clarity vasthadi...elephant memory 🙏🙏 pic.twitter.com/owZVjbrFzh

— Venky (@kvL0708)

నాగ్‌ అశ్విన్‌ రూపొందించిన `కల్కి` చిత్రంలో ప్రభాస్‌తోపాటు కమల్‌ హాసన్‌, అమితాబ్‌ బచ్చన్‌, దీపికా పదుకొనె, దిశా పటానీ, శోభన, రాజేంద్ర ప్రసాద్‌, బ్రహ్మనందం, మాళవిక నాయర్‌ నటిస్తున్నారు. గెస్ట్ లుగా చాలా మంది హీరోహీరోయిన్లు కనిపిస్తారని తెలుస్తుంది. అశ్వనీదత్‌ సుమారు ఆరు-ఏడు వందల కోట్ల బడ్జెట్‌తో ఈ మూవీని భారీగా నిర్మించిన విషయం తెలిసిందే. 
 

click me!