పవన్ కళ్యాణ్ వల్లే బాహుబలి ఇంటర్వెల్ సీన్స్ అద్భుతంగా వచ్చాయా..

Published : Apr 30, 2017, 01:16 PM ISTUpdated : Mar 25, 2018, 11:39 PM IST
పవన్ కళ్యాణ్ వల్లే బాహుబలి ఇంటర్వెల్ సీన్స్ అద్భుతంగా వచ్చాయా..

సారాంశం

బాహుబలి సినిమాలో కీలక సీన్స్ పై పవన్ కళ్యాణ్ ప్రభావం పవన్ ఫ్యాన్స్ ను ఆదర్శంగా తీసుకుని ఇంటర్వెల్ సీన్స్ రాసిన విజయేంద్ర ప్రసాద్ బాహుబలి పార్ట్1, పార్ట్ 2 రెండిటిలో గూజ్ బంప్స్ తెప్పించే ఇంటర్వెల్ సీన్స్

మెగా ఫ్యామిలీ హీరోలకు సంబంధించిన ఏ ఈవెంట్ జరిగినా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చేయాల్సిన రచ్చకు మాత్రం ఏ మాత్రం లోటుండదు. చాలా కాలంగా పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ పవర్ స్టార్ పవర్ స్టార్.. అని అరుపులతో మెరిపించడం జరిగి తీరాల్సిందే. అయితే ఇలాంటి సంఘటనలే ఇప్పుడు ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్న జక్కన్న బాహుబలి2 సినిమాకి ఆదర్శంగా నిలిచాయని స్వయంగా బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్ చెప్తున్నారు.

 

"ఓసారి పవన్ కళ్యాణ్ సినిమా ఆడియో ఫంక్షన్ జరుగుతోంది. అక్కడికి పవన్ కళ్యాణ్ ఇంకా చేరుకోనేలేదు. కానీ పవన్ పేరు ప్రాంగణమంతా మారు మ్రోగి పోతోంది. ఆ అరుపులు ఇతరులకు అసూయ కలిగేలా వినిపిస్తున్నాయి. అదే సంఘటన బాహుబలి2 ఇంటర్వెల్ సీన్ రాయటానికి దారితీసింది. అలాగే నేను ఆలోచించాను. భల్లాలదేవుని ముందు జనమంతా బాహుబలి పేరును స్మరిస్తుంటే దద్దరిల్లిపోయోలా చేస్తే బాగుంటుందని ఆ సీన్ అలా డిజైన్ చేశాం". అంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు క్రెడిట్ ఇచ్చేసారు విజయేంద్ర ప్రసాద్. పవన్ ఫ్యాన్స్ కు దక్కాల్సిన క్రెడిటే కదా.

 

విశేషమేంటంటే బాహుబలి పార్ట్1, పార్ట్2 రెండింటికీ ఇంటర్వల్ సీన్స్ విజయేంద్ర ప్రసాద్ రాశారు. మొదటి పార్ట్ లో బాహుబలిని చూసి బాహుబలి అని అంతా జపించడం, రెండో పార్ట్ లో బాహుబలి ప్రమాణ స్వీకారం(సేనాధిపతిగా) సందర్భంగా జనం నినదంచడం.. ఈ రెండు సీన్స్ కు పవన్ ఫ్యాన్స్ అరుపులే ఆదర్శంగా నిలిచాయి.

PREV
click me!

Recommended Stories

Dhurandhar Collection: ధురంధర్‌ మూవీ ఫస్ట్‌ డే కలెక్షన్లు.. రణ్‌వీర్‌ సింగ్‌ సునామీకి బాక్సాఫీస్ షేక్
Pawan kalyan ఉదయ్ కిరణ్ కాంబినేషన్ లో మిస్సైన మల్టీ స్టారర్ మూవీ ఏదో తెలుసా?