రేణు దేశాయ్ కు గాయాలు.. సోషల్ మీడియాలో వెల్లడించిన పవర్ స్టార్ మాజీ భార్య

Published : Jun 28, 2023, 11:44 AM IST
రేణు దేశాయ్ కు గాయాలు.. సోషల్ మీడియాలో వెల్లడించిన పవర్ స్టార్ మాజీ భార్య

సారాంశం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య, మాజీ హీరోయిన్ రేణు దేశాయ్ గాయపడ్డారు. ఆమె కాలి వేళ్లకు తీవ్ర గాయాలు అయినట్టు తెలుస్తోంది. 

రీ ఎంట్రీకి రెడీ అవుతోంది... పవర్ స్టార్  పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్.  చాలా కాలం తర్వాత తిరిగి సినిమాలలోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈమె రవితేజ హీరోగా నటిస్తున్న టైగర్ నాగేశ్వరరావు సినిమా ద్వారా..సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చయబోతోంది రేణు. ఈసినిమాలో రవితేజ సిస్టర్ క్యారెక్టర్ లో ఆమె  ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు తెలుస్తోంది. అయితే రేణు దేశాయ్ చాలా కాలంగా  సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటోంది. 

తనకు సబంధించిన విషయాలు.. తన పిల్లలకు సంబంధించిన విషయాలతో పాటు.. అన్ని విషయాలు అభిమానులతో పంచుకుంటారు రేణు. మరీ ముఖ్యంగా తన  పిల్లలకు సంబంధించిన విషయాలను.. వారుసాధించిన ఘనతలను ముఖ్యంగా అఖీరా నందన్ కు సంబంధించిన అన్ని విషయాలను ఈమె ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ సందడి చేస్తున్నారు. రీసెంట్ గా అకీరానందన్ వర్కౌట్స్  వీడియోఒకటి పోస్ట్ చేసిన రేణుదేశాయ్.. తనకు చాలా గర్వంగా ఉందంటూ పోస్ట్ కూడా పెట్టింది. 

అయితే తాజాగా రేణు దేశాయ్ పెట్టిన  మరొక పోస్ట్.. తన అభిమానులకు కంగారు పెట్టింది. రెండు రోజుల క్రితం తన కాలికి తీవ్రమైన గాయం అయ్యిందని.. దాంతో తన  కాలి మూడు వేళ్ళు చాలా దెబ్బతిన్నాయని ముఖ్యంగా మరొక వేలు  చితికిపోయింది అంటూ  సోషల్ మీడియా వేదికగా  ఈమె తనకు గాయం అయిన విషయాన్ని తెలియచేస్తూ ఒక పోస్ట్ చేశారు. 

అంత గాయం అయినా కూడా లెక్క చేయకుండా.. బీచ్ లో ఎంజాయ్ చేస్తోంది రేణూ దేశాయ్. ఇలా ఈమె కాలికి గాయమైనప్పటికీ అలాగే నడుచుకుంటూ బీచ్ లో ఎంజాయ్ చేశారు. అయితే తన కాలుకు గాయం ఎలా అయ్యింది అన్న విషయం మాత్రం ఆమె ఇప్పటివరకూ వెల్లడించలేదు. ఇక ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ పోస్ట్ చేసిన అభిమానులు మాత్రం.. రేణు జాగ్రత్తగా ఉండాల్సిందిగా సూచిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Sreenivasan: నటుడు శ్రీనివాసన్ ని ఆరాధించిన సూపర్‌ స్టార్‌ ఎవరో తెలుసా? ఏకంగా తన పాత్రకి డబ్బింగ్‌
కృష్ణ ను భయపెట్టిన చిరంజీవి సినిమా, మెగాస్టార్ కు చెక్ పెట్టడానికి సూపర్ స్టార్ మాస్టర్ ప్లాన్