'సైరా'లో పవన్ కళ్యాణ్ డైలాగ్ లీక్.. టీజర్ పై ఉత్కంఠ!

Published : Aug 16, 2019, 04:23 PM ISTUpdated : Aug 16, 2019, 05:10 PM IST
'సైరా'లో పవన్ కళ్యాణ్ డైలాగ్ లీక్.. టీజర్ పై ఉత్కంఠ!

సారాంశం

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటిస్తున్న చిత్రం సైరా నరసింహారెడ్డి. తొలి తెలుగు స్వాతంత్ర ఉద్యమవీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో, రాంచరణ్ నిర్మాతగా దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. 

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటిస్తున్న చిత్రం సైరా నరసింహారెడ్డి. తొలి తెలుగు స్వాతంత్ర ఉద్యమవీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో, రాంచరణ్ నిర్మాతగా దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇటీవల స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన మేకింగ్ వీడియో సినిమాపై అంచనాలు పెంచేసింది. 

ఆగష్టు 20న సైరా టీజర్ రిలీజ్ చేయనున్నారు. ఈ టీజర్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొనివుంది. తాజాగా సినిమాపై మరింత ఆసక్తిని పెంచే విషయాన్ని చిత్ర యూనిట్ ప్రకటించింది. జనసేనాని పవన్ కళ్యాణ్ సైరా టీజర్ కు వాయిస్ ఓవర్ అందించిన సంగతి తెలిసిందే. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 

ఇదిలా ఉండగా సైరా టీజర్ లో పవన్ నరసింహా రెడ్డి గురించి ఏం చెబుతారనే ఆసక్తి నెలకొని ఉంది. పవన్ వాయిస్ ఓవర్ ఇచ్చిన ఓ డైలాగ్ లీక్ అయింది. 'అందరు గుర్తించిన వీరులు ఎందరో ఉన్నారు.. కానీ ఎవరూ గుర్తించని వీరుడొక్కడు ఉన్నారు.. ఆయనే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' అంటూ పవన్ కళ్యాణ్ చెప్పే డైలాగ్ తో టీజర్ ప్రారంభం అవుతుందట. 

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, తమన్నా, కిచ్చా సుదీప్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. 

చిరు గెటప్ పై మీమ్స్.. ట్రోల్ చేస్తోన్న నెటిజన్లు!

'సైరా'లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్!

PREV
click me!

Recommended Stories

Gunde Ninda Gudi Gantalu Today ఎపిసోడ్ డిసెంబర్ 16 బాలుని సవతి తల్లిలా చూశాను... ప్రభావతిలో మొదలైన పశ్ఛాత్తాపం
Regina Cassandra: ముస్లింగా పుట్టి క్రిస్టియన్ పేరు ఎందుకు పెట్టుకుందో చెప్పేసిన రెజీనా