రిలీజ్ కు సిద్దమవుతున్న గోపీచంద్ చాణక్య

Published : Aug 16, 2019, 03:36 PM IST
రిలీజ్ కు సిద్దమవుతున్న గోపీచంద్ చాణక్య

సారాంశం

  యాక్షన్ హీరో గోపీచంద్ రా ఏజెంట్ గా నటిస్తున్న మూవీ చాణక్య. కోలీవుడ్ దర్శకుడు తిరు తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ సినిమాపై ఇప్పటికే ఓ వర్గం ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. సినిమా తప్పకుండా బాక్స్ ఆఫీస్ వద్ద క్లిక్కవుతుందని గోపీచంద్ కష్టపడుతున్నాడు

యాక్షన్ హీరో గోపీచంద్ రా ఏజెంట్ గా నటిస్తున్న మూవీ చాణక్య. కోలీవుడ్ దర్శకుడు తిరు తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ సినిమాపై ఇప్పటికే ఓ వర్గం ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. సినిమా తప్పకుండా బాక్స్ ఆఫీస్ వద్ద క్లిక్కవుతుందని గోపీచంద్ కష్టపడుతున్నాడు. అయితే సినిమా షూటిగ్ మొదలై నెలలు గడుస్తున్నా ఇంకా విడుదల తేదీపై క్లారిటీ ఇవ్వలేదు. 

అయితే చిత్ర యూనిట్ త్వరలోనే సినిమా రిలీజ్ డేట్ ను ఎనౌన్స్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే షూటింగ్ ను దాదాపు ఎండ్ చేసినట్లు తెలుస్తోంది. ఇక రీసెంట్ గా డబ్బింగ్ పనులను మొదలుపెట్టిన దర్శకుడు టీజర్ ను రెడీ చేసే పనిలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. టీజర్ ను రిలీజ్ చేసి సినిమా విడుదల తేదీపై కూడా అప్పుడే క్లారిటీ ఇవ్వాలని అనుకుంటున్నారు. 

కుదిరితే సెప్టెంబర్ లోనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. బాలీవుడ్ యాక్టర్ జరీన్ ఖాన్ - మెహ్రీన్ పిర్జాద సినిమాలో హీరోయిన్స్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక రామ్ బ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు.

PREV
click me!

Recommended Stories

రాజాసాబ్ చేయకుండా తప్పించుకున్న ఇద్దరు స్టార్ హీరోలు ఎవరో తెలుసా? ప్రభాస్ ను బుక్ చేశారుగా
The Raja Saab 6 Days Collection: ది రాజాసాబ్‌కి ఆరో రోజు పెరిగిన కలెక్షన్లు.. ప్రభాస్‌ టార్గెట్‌కి ఎంత దూరంలో ఉన్నాడంటే