జనసైనికుల చిరకాల స్వప్నం... న్యూస్ ఛానల్ పెడుతున్న బండ్ల గణేష్ 

By Sambi ReddyFirst Published Aug 27, 2022, 1:58 PM IST
Highlights


నిర్మాత నటుడు బండ్ల గణేష్ న్యూస్ ఛానల్ పెడుతున్నట్లు వెల్లడించాడు. ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా సోషల్ మీడియాలో హింట్ ఇచ్చాడు. 

బండ్ల గణేష్ న్యూస్ ఛానల్ పెట్టబోతున్నారట. ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఆయన ఈ విషయం వెల్లడించారు. అయితే అది ఎప్పుడు అనేది తెలియదు. కేవలం ప్లానింగ్ దశలో ఉందని చెప్పాడు. సర్ ఓ న్యూస్ ఛానల్ పెట్టొచ్చుగా అన్న ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు. ఈ రోజుల్లో మీడియా రంగంలోకి రావడం అనే ఏదో ఒక పార్టీకి కొమ్ము ఖాయడమే. మీడియా సప్పోర్ట్ ఉంటే జనాలను గుడ్డివాళ్లను చెయ్యొచ్చని మేధావులు నిరూపించిన క్రమంలో ప్రతి పార్టీ రెండు మూడు న్యూస్ ఛానల్స్ మైంటైన్ చేస్తున్నాయి. 

పవన్ కళ్యాణ్ అభిమానుల్లో అసహనం కూడా ఇదే. జనసేన పార్టీకి పేరున్న ఒక్క న్యూస్ ఛానల్ లేదు. అత్యధిక టీఆర్పీ కలిగిన ప్రముఖ ఛానల్స్ అధికార ప్రతిపక్షాల తరపున పని చేస్తున్నాయి. కాకపోతే ప్రతిపక్షాలకు చెందిన ఛానల్స్ ఆయనకు సప్పోర్ట్ ఇస్తూ, విస్తృత స్థాయిలో కవరేజ్ చేస్తున్నాయి. అది అధికార పక్షం మీద కోపంతో చేసే పని తప్పితే పవన్ పై ప్రేమతో కాదు. ప్రింట్ మీడియాతో మొదలైన ఈ సంప్రదాయం ఎలక్ట్రానిక్, వెబ్ మీడియాకు పాకింది. న్యూట్రల్ గా పని చేసే మీడియా సంస్థలు ఒక్కటంటే ఒక్కటి కూడా లేవు. జనసేన పార్టీ తరపున కొన్ని వెబ్ మీడియా సంస్థలు వెలిశాయి. ఆ పార్టీ కోసం పని చేస్తున్నాయి. జనాలకు ఎక్కువగా రీచ్ అయ్యే మీడియా ఛానల్ కావాలనేది వాళ్ళ ఆకాంక్ష. 

In Planning bro 😎 https://t.co/8GgmZ2TTbj

— BANDLA GANESH. (@ganeshbandla)

నిజంగా బండ్ల గణేష్ న్యూస్ ఛానల్ పెడితే అది ఖచ్చితంగా జనసేన కోసం పని చేసే సంస్థగా ఉంటుంది. ఆ పార్టీకి విధేయతగా పని చేసే ఛానల్ దొరుకుతుంది. అయితే ఎన్నికలకు కనీసం రెండేళ్ల సమయం కూడా లేదు. ఇంత తక్కువ సమయంలో బండ్ల గణేష్ మీడియా సంస్థ స్థాపించడం, దాన్ని జనాల్లోకి తీసుకెళ్లడం కలే. కాబట్టి జనసైనికులకు బండ్ల గణేష్ న్యూస్ ఛానల్ వలన ఒరిగేది ఏమీ ఉండదు. అయితే దీర్ఘకాలంలో అది ఎంతో కొంత మేలు చేసే వీలు కలదు. 

click me!