అక్షయ్ కుమార్ లాంటి స్టార్ కు కూడా తప్పలేదు, రెమ్యూనరేషన్ భారీగా తగ్గించుకున్న స్టార్ హీరో

Published : Aug 27, 2022, 12:07 PM IST
అక్షయ్ కుమార్ లాంటి స్టార్ కు కూడా తప్పలేదు, రెమ్యూనరేషన్ భారీగా తగ్గించుకున్న స్టార్ హీరో

సారాంశం

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అందరి హీరోలకు ఆదర్శంగా ఉండేట్టు.. నిర్మాతలకు అభయ హస్తం ఇచ్చినట్టుగా బాలీవుడ్ సీనియర్ హీరో నిర్ణయం.. అంతట ప్రశంసలు కురిపిస్తోంది.   

ప్రస్తుతం ఇండస్ట్రీలో అంతటా చార్చనీయం అవుతున్న అంశం.. స్టార్ హీరోల రెమ్యూనరేషన్. మన దేశంలో స్టార్ హీరోలు కొంత మంది 100 కోట్టు కూడా తీసుకునేవారు ఉన్నారు. అటువంటి హీరోలలో అక్షయ్ కుమార్ కూడా ఒకరు.  అగ్ర హీరోలు భారీ పారితోషికాల్ని స్వీకరిస్తారనే విషయం తెలిసిందే.  హీరోలు ఇలా భారీగా రెమ్యూనరేషన్ తీసుకోవడం వల్లే.. సినిమాల బడ్జెట్ భారీగా పెరుగుతందని.. కలెక్షన్లు రాకపోవడంతో.. నిర్మాతలు..డిస్ట్రీబ్యూటర్లు నిండా మునుగుతున్నారని  చాలా కాలంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆందోళణ చెందుతున్నారు. 

 సినిమా బడ్జెట్‌ను నియంత్రించాలంటే టాప్‌ హీరోలు తమ పారితోషికాల్ని తగ్గించుకోవాల్సిందేననే డిమాండ్‌ అన్ని భాష ఫిల్మ్ ఇండస్ట్రీలలో  వినిపిస్తున్నది. ఇక రీసెంట్ గా  ఈ విషయంలో బాలీవుడ్ స్టార్ హీరో్ అక్షయ్ కుమార్ తీసుకున్న నిర్ణయం అంతటా హాట్ టాపిక్ అవుతుంది. ఆయన తన నెక్ట్స్ సినిమా నుంచి తన రెమ్యూనరేషన్ తగ్గించుకున్నారట.  కొంత మంది టాప్ హీరోలకు ఈ విషయం రుచించకపోయినా..  బాలీవుడ్‌ అగ్ర హీరో అక్షయ్‌ కుమార్‌  మాత్రం మంచి నిర్ణయం తీసకున్నాడంటూ.. ఇండస్ట్రీ పెద్దలు తెగ పొగిడేస్తున్నార.  

చాలా కాలంగా వరుస సినిమాలు చేస్తున్న అక్షయ్ కుమార్.. గత కొంత కాలంగా వరుస పరాజయాలను చూస్తున్నారు. ఎన్ని సినిమాలు.. ఎన్ని ప్రయోగాలు చేసినా.. ఆయనకు కాలం కలిసి రావడం లేదు.  ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన రక్షాబంధన్‌ కూడా ప్లాప్అవ్వడంతో.. తీవ్రమైన నిరాశలో పడిపోయాడు అక్షయ్.  దీంతో తన నె క్ట్స్ మూవీ కెరీర్ బాగుండాలి అంటే.. రేటు తగ్గించుకోవడమే మంచిదని భావించాడటన అక్షయ్. ఇక  అక్షయ్‌ కుమార్‌ గత ఐదేళ్లుగా ఒక్కో సినిమాకు దాదాపు 80 కోట్ల నుంచి 100 కోట్ల వరకూ తీసుకుంటున్నాడు. ఇక తాజా నిర్ణయం ప్రకారం ఆయన ప్రతీ సినిమాకు 20 కోట్ల లోపే రెమ్యూనరేషన్ తీసుకునేలా.. చిన్న సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నాడట. 

అయితే ఆయన ఇంతలా రేటు తగ్గించుకోవడానికి మరో కారణం కూడా ఉంది. ఒక వేళ తను చేసిన సినిమా సూపర్ సక్సెస్‌ అయితే... ఆ సినిమా  లాభాల్లో యాభైశాతం షేర్‌ ఇవ్వాల్సి ఉంటుందనే షరతు విధించినట్లు తెలిసింది. దీని ప్రకారమే అక్షయ్ నెక్ట్స్ సినిమాలు చేయబోతున్నట్టు సమాచారం. 

ఇక హీరోగా.. నిర్మాతగారాణిస్తున్న అక్షయ్ కుమార్.. తాను స్వయంగా నిర్మించే సినిమాల విషయంలో మాత్రం రెమ్యూనరేషన్ లేకుండా... ఓన్లీ ప్రాఫిట్స్‌నే తీసుకోవాలని అక్షయ్‌ కుమార్‌ నిర్ణయించుకున్నాడట. కొన్నేళ్లుగా అమీర్‌ఖాన్‌ ఇదే పద్దతిలో సినిమాలు చేస్తున్నాడని చెబుతున్నారు. అక్షయ్‌ కుమార్‌ తాజా నిర్ణయానికి ప్రొడ్యూసర్స్ దిల్ ఖుష్ అవుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?