చరణ్ - బన్నీ ఎలక్షన్ ప్రచారాలపై క్లారిటీ ఇచ్చిన పవన్!

Published : Mar 29, 2019, 06:23 PM ISTUpdated : Mar 29, 2019, 08:54 PM IST
చరణ్ - బన్నీ ఎలక్షన్ ప్రచారాలపై క్లారిటీ ఇచ్చిన పవన్!

సారాంశం

స్టార్ హీరోలు కొంత మంది త్వరలోనే ఎలక్షన్స్ ప్రచారాల్లో బిజీ కానున్నట్లు ఇటీవల కొన్ని రూమర్స్ వచ్చాయి. మెయిన్ గా అల్లు అర్జున్ - రామ్ చరణ్ జనసేన పార్టీ కోసం ప్రచారాలు చేసే అవకాశం ఉందని టాక్ వచ్చింది. అయితే ఈ విషయంపై ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వివరణ ఇచ్చారు. 

టాలీవుడ్ లో చాలా వరకు నటీనటులు ఎప్పుడు లేని విధంగా ఎలక్షన్స్ లో బిజీగా మారుతున్నారు. అయితే స్టార్ హీరోలు కొంత మంది త్వరలోనే ఎలక్షన్స్ ప్రచారాల్లో బిజీ కానున్నట్లు ఇటీవల కొన్ని రూమర్స్ వచ్చాయి. మెయిన్ గా అల్లు అర్జున్ - రామ్ చరణ్ జనసేన పార్టీ కోసం ప్రచారాలు చేసే అవకాశం ఉందని టాక్ వచ్చింది. 

అయితే ఈ విషయంపై ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వివరణ ఇచ్చారు. అసలు ఈ విషయం వేరేవాళ్లు చెబితే  తప్ప నేను ప్రత్యేకంగా తెలుసుకోలేదు. వారిని స్పెషల్ గా పాలిటిక్స్ లోకి పిలిచి ఇక్కడి వాతావరణంలో రుద్దాలని అనుకోవడం లేదు. గతంలో కూడా చెప్పాను. ఒక సీజన్ కి వారిని పాలిటిక్స్ కి రానివ్వకూడదు. 

ఒకేసారి సినిమాలు పాలిటిక్స్ అంటే కష్టం. ఒకటి రెండు సందర్భాల్లో చరణ్ అన్నట్లు నాకు తెలిసింది. డైరెక్ట్ గా నా ముందు అనలేదు గాని ఒకవేళ అడిగి ఉంటె అప్పుడే వారికి వివరణ ఇచ్చేవాన్ని అంటూ.. వారి జాబ్ వారు చేసుకోవడం బెటర్ అని పవన్ క్లియర్ గా చెప్పేశాడు. దీంతో ఈ ప్రచారాల్లో బన్నీ - చరణ్  పాల్గొనడం అనేది జరగదని అర్ధం చేసుకోవచ్చు. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu Winners : టైటిల్ గెలిచారు కానీ.. ఉపయోగం లేదు, బిగ్ బాస్ తెలుగు విన్నర్స్ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎక్కడున్నారు?
Illu Illalu Pillalu Today Episode Dec 22: ధీరజ్ కంట పడిన విశ్వ, అమూల్య.. మరోపక్క వల్లి భయం