ఆ హీరోతో లవ్ ఎఫైర్.. క్లారిటీ ఇచ్చిన మహేష్ బ్యూటీ!

Published : Mar 29, 2019, 04:53 PM IST
ఆ హీరోతో లవ్ ఎఫైర్.. క్లారిటీ ఇచ్చిన మహేష్ బ్యూటీ!

సారాంశం

తెలుగులో 'భరత్ అనే నేను' చిత్రంతో ప్రేక్షకులకు దగ్గరైన కియారా అద్వానీ ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీగా గడుపుతోంది. 

తెలుగులో 'భరత్ అనే నేను' చిత్రంతో ప్రేక్షకులకు దగ్గరైన కియారా అద్వానీ ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీగా గడుపుతోంది. వెబ్ సిరీస్, సినిమాలు అంటూ ప్రేక్షకుల్లో ఫాలోయింగ్ మరింత పెంచుకుంటుంది. 

అయితే చాలాకాలంగా ఈ బ్యూటీ ప్రేమలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో కియారా డేటింగ్ చేస్తుందని టాక్. ఇద్దరూ కలిసి పార్టీల్లో కనిపించడంతో మీడియాలో వార్తలు హల్చల్ చేసేవి.

తాజాగా వీటిపై స్పందించిన కియారా తను ఎవరినీ ప్రేమించడం లేదని క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం తాను సింగిల్ గా ఉన్నట్లు, తనపై వస్తున్న వార్తల్లో నిజం లేదని వెల్లడించింది. అయితే ఇదే విషయాన్ని సిద్ధార్థ్ మల్హోత్రా వద్ద ప్రస్తావించగా.. పని తప్ప తనకు మరేదీ సంతోషాన్ని ఇవ్వదని చెప్పాడు.

కియారాతో పని చేయడానికి ఉత్సాహంగా ఉన్నానని, పత్రికల్లో వచ్చే రూమర్ల గురించి తనకు తెలియదని అన్నాడు. తన జీవితం అందరూ అనుకుంటున్నట్లుగా రంగుల మాయం కాదని, నిజ జీవితంలో తనకుండే ఆనందాలు చాలా తక్కువని చెప్పాడు.

PREV
click me!

Recommended Stories

భార్యతో పదేళ్ల ప్రేమను సెలబ్రేట్ చేసుకున్న రిషబ్ శెట్టి..బ్యూటిఫుల్ ఫోటోస్ వైరల్
Medha Rana: బోర్డర్ 2తో ప్రేక్షకుల మనసు గెలిచిన నటి ? ఆమె కుటుంబ సభ్యులంతా..