విడాకుల రూమర్స్ కి పవన్‌ చెక్‌.. ఒక్క ఫోటోతో అన్నింటికి సమాధానం.. భార్యతో కలిసి పూజా కార్యక్రమంలో..

Published : Jul 05, 2023, 07:24 PM ISTUpdated : Jul 05, 2023, 07:30 PM IST
విడాకుల రూమర్స్ కి పవన్‌ చెక్‌.. ఒక్క ఫోటోతో అన్నింటికి సమాధానం.. భార్యతో కలిసి పూజా కార్యక్రమంలో..

సారాంశం

పవన్‌ కళ్యాణ్‌ విడాకుల రూమర్లకి చెక్‌ పెట్టారు. ఆయన తన మూడో భార్యతో విడిపోతున్నారని, ఆమె దూరంగా ఉంటుందనే పుకార్లు వ్యాపించిన నేపథ్యంలో తాజాగా ఒక్క ఫోటోతో అందరికి సమాధానం చెప్పారు పవన్‌.

పవన్‌ కళ్యాణ్‌.. తన మూడో భార్య అన్నా లెజినోవా తనకు దూరంగా ఉంటుందని, ఈఇద్దరు విడిపోతున్నట్టు రూమర్స్ వినిపించిన విషయం తెలిసిందే. తాజాగా ఆయా రూమర్స్ కి చెక్‌ పెట్టారు పవన్‌. తాజాగా ఒక్క ఫోటోతో అందరికి సమాధానం చెప్పారు. తాజాగా ఆయన భార్యతో కలిసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మొదటి దశ వారాహి యాత్ర పూర్తి చేసుకున్న నేపథ్యంలో పవన్ హైదరాబాద్‌లోని తన నివాసంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అందులో పవన్‌ తోపాటు భార్య అన్నా లెజినోవా కూడా ఉండటం విశేషం. దీంతో ఈ ఒక్క ఫోటో అన్ని రూమర్స్ కి చెక్‌ పెట్టిందని చెప్పొచ్చు. 

పవన్‌ మూడో భార్య అన్నా లెజినోవా.. గత కొంత కాలంగా పవన్ కి దూరంగా ఉంటుందని, ఆమె పిల్లలతో కలిసి రష్యా వెళ్లిపోయిందని వార్తలు కొన్ని రోజులుగా నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా వాటికి క్లారిటీ వచ్చింది. ఇదంతా వైసీపీ వాళ్లు క్రియేట్‌ చేసిన రూమర్‌ అనే వార్తలు వినిపిస్తున్నాయి. పవన్ ని బ్లేమ్‌ చేసేందుకు వాళ్లే ఇది సృష్టించారని పవన్‌ అభిమానులు అంటున్నారు.  

ఇక పవన్‌, అన్నా లెజినోవా కలిసి పూజా చేస్తున్న విషయాలను జనసేన పార్టీ అధికారిక ట్విట్టర్‌ అకౌంట్‌ ద్వారా వెల్లడించారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్‌ కళ్యాణ్‌, శ్రీమతి అనా కొణిదెల  వారాహి విజయ యాత్ర తొలి దశ దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్‌లోని తమ నివాసంలో నిర్వహించిన పూజాదికాలలో పాల్గొన్నారు. శాస్త్రోక్తంగా చేపట్టిన ఈ ధార్మిక విధులను పవన్‌ కళ్యాణ్‌, అనా కొణిదెల దంపతులు నిర్వర్తించారు. కొద్ది రోజుల్లో వారాహి విజయ యాత్ర తదుపరి దశ మొదలవుతుంది. ఇందుకు సంబంధించిన సన్నాహక సమావేశాల్లో పాల్గొనేందుకు పవన్‌ త్వరలో మంగళగిరి చేరుకుంటారు` అని పేర్కొన్నారు.

ఇక సినిమాల పరంగా పవన్‌.. ఫుల్‌ బిజీగా ఉన్నారు. ఈ నెలలో `బ్రో` రిలీజ్‌ కాబోతుంది. జులై 28న ఈ చిత్రం రిలీజ్‌ కాబోతున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఫారెన్‌లో సాంగ్‌ షూటింగ్‌ని కూడా పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌ వర్క్ శరవేగంగా జరుగుతున్నాయి. సముద్రఖని దీనికి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. దీంతోపాటు హరీష్‌ శంకర్‌తో `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌`, సుజీత్‌తో `ఓజీ` చిత్రాలు చేస్తున్నారు. అలాగే `హరిహర వీరమల్లు` కూడా దాదాపు 70శాతం చిత్రీకరణ పూర్తయ్యింది. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Thanuja: కళ్యాణ్ పాడు చేసుకుంటున్నాడు, తనూజలో సడెన్ గా ఈ మార్పు దేనికోసం.. సూటిగా ప్రశ్నించిన అభిమాని
Top 6 Romantic Movies: 2025లో టాప్ 6 రొమాంటిక్ మూవీస్, ఆ ఒక్క సినిమాకి ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్