టాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ రెడ్డి త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. తాజాగా ఆయన నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఇందుకు సంబంధించిన ఎంగేజ్ మెంట్ ఫొటో నెట్టింట వైరల్ గా మారింది.
‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రంతో సాయి సుశాంత్ రెడ్డి (Sushanth Reddy) తెలుగు ఆడియెన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఈ చిత్రంలో సుశాంత్ రెడ్డి నటన ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. తన టైమింగ్ తో అందరినీ మెప్పించారు. ఇక ఈ చిత్రం రిలీజ్ అయ్యి రీసెంట్ గా ఐదేళ్లు పూర్తి చేసుకుంది. దీంతో మేకర్స్ రీరిలీజ్ కూడా చేసిన విషయం తెలిసిందే. ఆడియెన్స్ థియేటర్లలో సినిమాను బాగా ఎంజాయ్ చేశారు.
అయితే, ఈ చిత్రం తర్వాత సుశాంత్ రెడ్డి నటుడిగా అవకాశాలు అందుకుంటూనే ఉన్నారు. కెరీర్ ఇప్పుడిప్పుడే స్పీడ్ అవుతోంది. ఈ క్రమంలో సుశాంత్ మరో గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలో ఆయన ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తాజాగా నిశ్చితార్థం కూడా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. సడెన్ గా ఎంగేజ్ మెంట్ చేసుకోవడంతో అందరూ షాక్ అవుతున్నారు.
ఏదేమైనా సుశాంత్ ఓ ఇంటివాడు కాబోతుండటంతో నెటిజన్లు ఖుషీ అవుతున్నారు. అందరూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక సుశాంత్ రెడ్డి చేసుకోబోయే అమ్మాయి గురించి ఎలాంటి వివరాలు తెలియలేదు. పైగా తన ఎంగేజ్ మెంట్ ఫొటోలను కూడా సోషల్ మీడియా నుంచి తొలగిస్తుండటం గమనార్హం.
ఈ నగరానికేమైంది చిత్రం తర్వాత సుశాంత్ రెడ్డి ‘భొంబాట్’, అక్కినేని నాగచైతన్య నటించిన ‘థ్యాంక్యూ’ మూవీలో కీలక పాత్రలు పోషించారు. మున్ముందు ఇంకెలాంటి పాత్రల్లో అలరిస్తారో చూడాలి. ఇక టాలీవుడ్ లో ఇప్పటికే శర్వానంద్ పెళ్లి పీటలు ఎక్కిన విషయం తెలిసిందే. నెక్ట్స్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) - లావణ్య త్రిపాఠి పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయి. గత నెలలోనే వీరి ఎంగేజ్ మెంట్ ఘనంగా జరిగింది.