ఏమయ్యా దిల్ రాజు ఎందుకు తీశావయ్యా వకీల్ సాబ్... ఆయన రెడ్డే నువ్వు రెడ్డే, మీ ఇద్దరు రెడ్లు తేల్చుకోండి

Published : Sep 25, 2021, 11:21 PM IST
ఏమయ్యా దిల్ రాజు ఎందుకు తీశావయ్యా వకీల్ సాబ్... ఆయన రెడ్డే నువ్వు రెడ్డే, మీ ఇద్దరు రెడ్లు తేల్చుకోండి

సారాంశం

దిల్ రాజు అంటే తెలియదేమో నేను రెడ్డి అని చెప్పు.. సీఎం జగన్ నీ పట్ల సానుకూలత చూపిస్తాడేమో అన్నారు. వకీల్ సాబ్ సినిమా ఎందుకు తీశావయ్యా... నా సినిమా తీయకపోతే ఇప్పుడు ఆంధ్రాలో అన్ని సినిమాలు విడుదల అయ్యేవి, అంటూ దిల్ రాజుని ప్రశ్నించారు.   

రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ వేదిక సాక్షిగా పవన్ ఆవేశంతో ఊగిపోయారు. ఆయన పరిశ్రమ పెద్దలు, వైసీపీ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. నిర్మాతలకు చేటు చేసేలా ఉన్న ఏపీ ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నించాలని గట్టిగా వాదించారు. ఈ క్రమంలో నిర్మాత దిల్ రాజుపై ఆయన కొంచెం వివాదాస్పద కామెంట్స్ చేశారు. నువ్వు రెడ్డే సీఎం జగన్ రెడ్డే.. మీరు మీరు తేల్చుకోండి. మీ రెడ్డే కదా, వెళ్లి మాట్లాడూ అంటూ విరుచుకుపడ్డారు. 

దిల్ రాజు అంటే తెలియదేమో నేను రెడ్డి అని చెప్పు.. సీఎం జగన్ నీ పట్ల సానుకూలత చూపిస్తాడేమో అన్నారు. వకీల్ సాబ్ సినిమా ఎందుకు తీశావయ్యా... నా సినిమా తీయకపోతే ఇప్పుడు ఆంధ్రాలో అన్ని సినిమాలు విడుదల అయ్యేవి, అంటూ దిల్ రాజుని ప్రశ్నించారు. 

వెల్త్ క్రియేషన్ లేకుంటే నేను దానాలు చేయగలనా, సంపాదిస్తూ సంపాదిస్తున్నా అంటారు. సంపాదించకపోతే దానాలు చేయగలనా అంటూ పవన్ ఆక్రోషం వెళ్లగక్కారు. ఆడబిడ్డలు హీరోయిన్ గా ఎదగడానికి, కొనసాగడానికి దేశంలో ఎక్కడెక్కడి నుండో వస్తారు. వాళ్లకు డబ్బులు ఇస్తున్నామని విమర్శిస్తారా. వెల్త్ క్రియేషన్ లేకపోతే డబ్బులు ఎక్కడికి నుండి వస్తాయి అంటూ పవన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: అలాంటి వాళ్ళు కప్ గెలిచినట్లు చరిత్రలో లేదు, ఈసారి బిగ్ బాస్ టైటిల్ ఎవరిదంటే ?
Kartik Aaryan: చెల్లి పెళ్లి వేడుకలో హంగామా చేసిన యంగ్ హీరో, సందడి మొత్తం అతడిదే.. వైరల్ ఫోటోస్