చిరంజీవి వైసీపీ ప్రభుత్వాన్ని బ్రతిమిలాడుకుంటున్నారు ... వాడు ఓ సన్నాసి.. పవన్ సెన్సేషనల్ కామెంట్స్

Published : Sep 25, 2021, 10:30 PM ISTUpdated : Sep 25, 2021, 10:32 PM IST
చిరంజీవి వైసీపీ ప్రభుత్వాన్ని బ్రతిమిలాడుకుంటున్నారు ... వాడు ఓ సన్నాసి.. పవన్ సెన్సేషనల్ కామెంట్స్

సారాంశం

పరిశ్రమకు జరుగుతున్న అన్యాయంపై పెద్దలు నోరువిప్పి మాట్లాడాలని పవన్(Pawan kalyan) అన్నారు. ఇక చిరంజీవి గారు వాళ్ళను ఎందుకు బ్రతిమిలాడుకుంటారని, ఓ వ్యక్తి నాతో అన్నారు. 

అనుకున్నట్లే రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ స్పీచ్ పూర్తిగా పొలిటికల్ యాంగిల్ లో సాగింది. ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం, నాయకులు టార్గెట్ గా ఆయన విరుచుకుపడ్డారు. సినిమా టికెట్ల రేట్లు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విధానాలు చిత్రపరిశ్రమను దెబ్బతీసేవిగా ఉన్నాయని ఆవేశం వ్యక్తం చేశారు. 


తన ఒక్కడి సినిమాలు ఆపడం కోసం పరిశ్రమ మొత్తాన్ని టార్గెట్ చేశారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. పరిశ్రమకు జరుగుతున్న అన్యాయంపై పెద్దలు నోరువిప్పి మాట్లాడాలని పవన్ అన్నారు. ఇక చిరంజీవి గారు వాళ్ళను ఎందుకు బ్రతిమిలాడుకుంటారని, ఓ వ్యక్తి నాతో అన్నారు, ఆయనది మంచి మనసు బ్రతిమిలాడుకుంటారు. ఎవరో ఓ మంత్రి చిరంజీవితో నాకు సోదరభావం ఉందని అన్నారు. చిత్ర పరిశ్రమకు అక్కరకు రాని సోదర భావం ఎందుకు. దాన్ని తీసుకెళ్లి చెత్తలో వేయండి అంటూ విరుచుకుపడ్డారు. 


నేను అన్నిటికీ తెగించే ఇలా మాట్లాడుతున్నాను అన్న పవన్ కళ్యాణ్.. వైసీపీ మంత్రిని సన్నాసి అంటూ సంబోధించడం విశేషం. ఇక బాలయ్యను కూడా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసినట్లు అనిపించింది. మా వంశాలు వేరు, మేము లేస్తే మనుషులం కాదని చెప్పుకునేవారు దైర్యంగా ముందుకు వచ్చి ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని గట్టిగా నిలదీశారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు