పాకిస్తాన్ లో సైతం టాప్ ట్రెండింగ్ లో 'బ్రో'.. పవన్, తేజు చిత్రానికి మాసివ్ రెస్పాన్స్

Published : Aug 31, 2023, 04:04 PM IST
పాకిస్తాన్ లో సైతం టాప్ ట్రెండింగ్ లో 'బ్రో'.. పవన్, తేజు చిత్రానికి మాసివ్ రెస్పాన్స్

సారాంశం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ కలసి నటించిన బ్రో చిత్రం జూలై 28న రిలీజైన సంగతి తెలిసిందే. తమిళ హిట్ చిత్రం వినోదయ సీతం రీమేక్ గా తెరకెక్కింది. 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ కలసి నటించిన బ్రో చిత్రం జూలై 28న రిలీజైన సంగతి తెలిసిందే. తమిళ హిట్ చిత్రం వినోదయ సీతం రీమేక్ గా తెరకెక్కింది. ఈ చిత్రానికి సముద్రఖని దర్శకత్వం వహించగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే డైలాగ్స్ అందించారు. 

బజ్ లేకుండా విడుదలైన ఈ చిత్రానికి క్రిటిక్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దారుణంగా నిరాశపరిచింది. పవన్ కళ్యాణ్, తేజు ప్రధాన పాత్రల్లో నటించగా.. కేతిక శర్మ, ప్రియా వారియర్ కీలక పాత్రల్లో నటించారు. థియేటర్స్ లో ఈ చిత్రం నిరాశపరచడంతో ఓటిటిలోకి త్వరగానే విడుదల చేశారు. 

నెట్ ఫ్లిక్స్ లో ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఇండియాలో ట్రెండింగ్ లో 1 వ స్థానంలో కొనసాగుతోంది. ఓటిటిలో ఈ చిత్రానికి స్టన్నింగ్ రెస్పాన్స్ వస్తోంది. ఓటిటి వేదికగా ఈ చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు. ఆశ్చర్యకర విషయం ఏంటంటే ఈ మూవీ పాకిస్తాన్ లో సైతం టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతుండడం విశేషం. పాక్ లో బ్రో మూవీ 8 వ స్థానంలో ట్రెండ్ అవుతోంది. 

బంగ్లాదేశ్ లో సైతం బ్రో చిత్రం ట్రెండింగ్ లో 8వ స్థానంలో ఉండడం విశేషం. వాస్తవానికి బ్రో చిత్రానికి థియేటర్స్ లో డీసెంట్ రెస్పాన్స్ వచ్చింది. అయితే పవన్ కళ్యాణ్ సినిమా కావడంతో ఫ్యాన్స్ అంచనాలు అందుకునే స్థాయిలో ఈ మూవీ లేకపోవడం వల్లే వసూళ్లు రాబట్టలేకపోయిందని విశ్లేషకులు అంటున్నారు. 

ఏది ఏమైనా బ్రో చిత్రం ఓటిటిలో అదిరిపోయే రెస్పాన్స్ అందుకుంటుండడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తండ్రి చనిపోయిన కుటుంబానికి పెద్ద కొడుకు అయిన సాయిధరమ్ తేజ్ అన్నీ చూసుకుంటుంటాడు. ప్రమాదంలో అతడు మరణించడం.. కాల దేవుడు ప్రత్యక్షమై 90 రోజుల్లో జీవిత సత్యాన్ని ఎలా వివరించాడు అనేదే ఈ చిత్ర కథ. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

500 కోట్ల ధురంధర్, స్టార్ హీరోలను కూడా భయపెడుతున్న రణ్ వీర్ సింగ్ సినిమా
రవితేజ సంచలన నిర్ణయం, మాస్ మహారాజా ట్యాగ్ ను దూరం పెట్టిన స్టార్ హీరో?