Jawan Trailer : యాక్షన్ థ్రిల్లింగ్ గా ‘జవాన్’ ట్రైలర్.. చూశారా.? డిఫరెంట్ అవతారాల్లో షారుఖ్ బీభత్సం..

Published : Aug 31, 2023, 02:51 PM IST
Jawan Trailer : యాక్షన్ థ్రిల్లింగ్ గా ‘జవాన్’ ట్రైలర్.. చూశారా.? డిఫరెంట్ అవతారాల్లో షారుఖ్ బీభత్సం..

సారాంశం

బాలీవుడ్ షారుఖ్ ఖాన్, నయనతార జంటగా నటించిన యాక్షన్ ఫిల్మ్ నుంచి కొద్దిసేపటి కింద పవర్ ఫుల్ ట్రైలర్ విడుదలైంది. అదిరిపోయే యాక్షన్, థ్రిల్లింగ్ అంశాలతో  ఆకట్టుకుంటోంది. కొద్ది సమయంలోనే వైరల్ గా మారింది.   

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan)  నెక్ట్స్ పాన్ ఇండియా సినిమా ‘జవాన్’ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘పఠాన్’ భారీ సక్సెస్ తర్వాత తమిళ స్టార్ అట్లీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం చిత్రం విడుదల కు సిద్ధంగా ఉంది. దీంతో యూనిట్ జోరుగా ప్రచార కార్యక్రమాలను  నిర్వహిస్తోంది. రీసెంట్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా గ్రాండ్ గా జరిగింది. 

వచ్చే నెలలోనే రిలీజ్ ఉండటంతో సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ను వదులుతున్నారు యూనిట్. ప్రమోషన్స్ లో భాగంగా బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అందిస్తున్నారు. ఇక తాజాగా Jawan Trailer  విడుదలై ఆకట్టుకుంటోంది. షారుఖ్ ఖాన్ సుముద్రంలో ఈదుతున్న దృష్యంతో ట్రైలర్ ప్రారంభం అవుతుంది. అంతకన్న ముందు చిత్రంలోని ప్రధాన పాత్రను రిఫర్ చేసేలా డైలాగ్స్ వినిపిస్తాయి. ఆ తర్వాత అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలు, థ్రిల్లింగ్ అంశాలతో ట్రైలర్ ఆద్యంతం ఆసక్తింగా సాగింది. చిత్రంలో బిగ్ స్టార్స్ ను పరిచయం చేస్తూ కట్ చేసిన ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. 

ట్రైలర్ లో షారుఖ్ ఖాన్ వివిధ అవతారాల్లో కనిపించి ఆకట్టుకున్నారు. జవాన్ గా, జనాలను ప్రేరేపించే వ్యక్తిగా, ఆయా రూపాల్లో కనిపించారు.  డైలాగ్స్ కూడా చాలా పవర్ ఫుల్ గా ఉన్నాయి. ‘పఠాన్’ మించి సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోబోతోందని, బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేసేలా కనిపిస్తోంది. ఇక నయనతార, షారుఖ్ మధ్య  కెమిస్ట్రీ ఆకట్టుకునేలా ఉంది. అలాగే విజయ్ సేతుపతి మాస్ అవతార్ లో రచ్చ చేయబోతున్నారని ట్రైలర్ ద్వారా అర్థమవుతోంది. ఇక అనిరుధ్ రవిచంద్రన్ అందించిన బీజీఎంకు థియేటర్లు బద్దలవ్వాల్సిందే. ఈ చిత్రం సెప్టెంబర్ 7న ఇండియన్ రీజినల్ లాంగ్వేజెస్ ల్లో గ్రాండ్ గా విడుదల అవుతోంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

500 కోట్ల ధురంధర్, స్టార్ హీరోలను కూడా భయపెడుతున్న రణ్ వీర్ సింగ్ సినిమా
రవితేజ సంచలన నిర్ణయం, మాస్ మహారాజా ట్యాగ్ ను దూరం పెట్టిన స్టార్ హీరో?