అల్లు అరవింద్‌ సినిమా ఆఫీస్‌ ముందు మహిళ నానా హంగామా.. అరెస్ట్

Published : Jul 14, 2021, 09:19 AM IST
అల్లు అరవింద్‌ సినిమా ఆఫీస్‌ ముందు మహిళ నానా హంగామా.. అరెస్ట్

సారాంశం

మెగా ప్రొడ్యూసర్‌ అల్లు అరవింద్‌ సినిమా ఆఫీస్‌ గీతా ఆర్ట్స్ ముందు నానా హంగామా చేసిన ఓ మహిళని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.

అల్లు అరవింద్‌ ప్రొడక్షన్‌ హౌజ్‌ గీతా ఆర్ట్స్ వద్ద హంగామా సృష్టించిన సునీత బోయ అనే మహిళ జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిర్మాత బన్నీవాసు తనని మోసం చేశాడని, తాను ఆత్మహత్యకు పాల్పడతానంటూ ఆమె గీతా ఆర్ట్స్ ఆఫీస్‌ ముందు బెదిరింపులకు దిగడంతో ఆఫీస్‌ మేనేజర్‌ ఫిర్యాదు మేరకు ఆమెని పోలీసులు అరెస్ట్ చేశారు. 

ఆ వివరాల్లోకి వెళితే.. గత కొంత కాలంగా మలక్‌పేట ప్రాంతంలో పుచ్చకాయలు అమ్ముకునే సునీత బోయకి గతంలో సినిమా పరిచయాలుండేవి. ఆ సమయంలో బన్నీ వాసు సినిమాల్లో అవకాశం కల్పిస్తానని తనని మోసం చేశాడని ఆమె కొన్ని రోజులుగా ఆరోపిస్తుంది. గతంలో ఇదే విషయంపై ఓ వీడియోని కూడా సోషల్‌ మీడియాలో పోస్ట్ చేయగా అది వైరల్‌ అయి వివాదాస్పదంగా మారింది. 

దీంతో బన్నీవాసు, ఆయన సన్నిహితులు ఇప్పటికే నాలుగుసార్లు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో ఆమె రెండు సార్లు జైలుకి కూడా వెళ్లారు. అంతేకాదు ఆమె మానసిక పరిస్థితి బాగా లేదని ఎర్రగడ్డ ఆసుపత్రిలో చికిత్స కూడా పొందారు. ఇటీవల మరో వీడియోని వదిలింది. బన్నీవాసు తనని బెదిరిస్తున్నాడని పేర్కొంది. తాజాగా ఏకంగా గీతా ఆర్ట్స్ కార్యాలయం ముందుకొచ్చి  ఆత్మహత్యకి పాల్పడతానని బెదిరిస్తూ ఓ వీడియోని విడుదల చేసింది. 

అంతేకాదు ఏకంగా మంగళవారం గీతా ఆర్ట్స్ కార్యాలయం ముందుకొచ్చి హంగామా సృష్టించిన ఆమెని ఆఫీస్‌ మేనేజర్‌ ఫిర్యాదుతో జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెపై కేసు నమోదు చేసి న్యాయమూర్తి వరకు తీసుకెళ్లారు. ఆమె మానసిక స్థితి సరిగా లేదని, మానసిక చికిత్సాలయానికి తరలించేలా ఆదేశించాలని పోలీసులు న్యాయమూర్తిని కోరారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Rajasekhar: డాడీ అని పిలిచిన అమ్మాయితోనే రొమాన్స్ చేసిన రాజశేఖర్‌.. కట్‌ చేస్తే ఇండస్ట్రీ దున్నేసింది
James Cameron-Rajamouli: పులులతో సీన్లు ఉంటే చెప్పు, వారణాసి సెట్ కి వస్తా.. రాజమౌళితో జేమ్స్ కామెరూన్