‘భీమ్లా నాయక్’ ప్రీరిలీజ్ బిజినెస్ లెక్కలు,నైజాంకే నలబై కోట్లు

By Surya PrakashFirst Published Nov 23, 2021, 6:39 PM IST
Highlights


సినిమా విడుదలకు ముందే పవర్ స్టార్ సినిమా మంచి బిజినెస్ చేసేసింది. దాదాపు రూ. 95 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ జరిగినట్టు సమాచారం. ముఖ్యంగా ఈ చిత్రం నైజాం ఏరియాలో ఈ సినిమాకు ఏకంగా నలబై కోట్లు వరకూ బిజినెస్ జరిగిందని వినికిడి.  

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan), దగ్గుబాటి రానా(Rana) ప్రధాన పాత్రల్లో సాగర్ కె చంద్ర దర్శకత్వంలో రూపొందుతోన్న యాక్షన్ థ్రిల్లర్ ‘భీమ్లా‌నాయక్’.(Bheemla Nayak) సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈసినిమాకి త్రివిక్రమ్ స్ర్కీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్న సంగతి తెలిసిందే. మలయాళ సూపర్ హిట్ చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ కిది అఫీషియల్ రీమేక్. Pawan Kalyan ఇమేజ్‌కి, తెలుగు నేటివిటీకి అనుగుణంగా ఒరిజినల్ వెర్షన్ కు స్వల్ప మార్పులు చేశారు త్రివిక్రమ్. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. 

ఈ సినిమాకి ఐదు రోజులు ముందు  రాజమౌళి క్రేజీ మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’ విడుదలవుతుండడంతో భీమ్లానాయక్ మూవీ విడుదల వాయిదా వేస్తారేమోనని అనుకున్నారు. అయితే నిర్మాతలు మాత్రం అదే డేట్ కు విడుదల చేయాలనే పట్టుదలతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ‘ఆర్.ఆర్.ఆర్’ లాంటి భారీ చిత్రానికి, అదే టైమ్ లో విడుదలయ్యే ప్రభాస్ ‘రాధేశ్యామ్’ చిత్రానికి నష్టాలు తప్పవనే ఆందోళనలో ఇండస్ట్రీ ఉంది. అయినా సరే తమ సినిమాను అనుకున్న తేదీలోనే విడుదల చేస్తామని చెబుతోంది సితారా సంస్థ. ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో కూడా ‘భీమ్లానాయక్’ చిత్రం కళ్ళు చెదిరే రేంజ్ లో ప్రీరిలీజ్ బిజినెస్ చేసిందనే టాక్ వినిపిస్తోంది.

 ఏకంగా రూ. 95కోట్ల బిజినెస్ చేసి రికార్డు నెలకొల్పింది ‘భీమ్లా నాయక్’ చిత్రం. ఈ అమౌంట్ ను కేవలం రెండు రోజుల్లోనే పవర్ స్టార్ తిరిగి రాబడతారని బయ్యర్స్ ధీమాగా ఉన్నారు. పవర్ స్టార్ మాస్ అపీరెన్స్ కు ఇప్పటికే బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది. కేవలం టీజర్స్, సింగిల్స్ తోనే విపరీతమైన అంచనాల్ని పెంచేసిన ‘భీమ్లానాయక్’ చిత్రం థియేటర్స్ లో అభిమానులకి పండగ చేసుకుంటారు.
  
దాదాపు 95  కోట్ల ప్రీరిలేజ్ బిజినెస్ జరిగిందంటే దీన్ని రెండ్రోజుల్లో వసూలు చేసే సత్తా వపర్ స్టార్ సినిమాకి ఉండి తీరుతుంది. పైగా దీనికి త్రివిక్రమ్ సంభాషణలు, స్క్రీన్ ప్లే తోడైంది. ఓ మాస్ పాత్ర పవర్ స్టార్ కు లభిస్తే ఎలా ఉంటుందో టీజర్ తోనే అర్థమైంది. సంక్రాంతి విడుదల నుంచి వెనక్కి తగ్గ వద్దని పవన్ కళ్యాణ్ అభిమానుల నుంచి కూడా ఒత్తిడి వస్తున్నట్లు సమాచారం. ఏం జరుగుతుందో చూడాలి. ముఖ్యంగా ఈ చిత్రం నైజాం ఏరియాలో ఈ సినిమాకు ఏకంగా నలబై కోట్లు వరకూ బిజినెస్ జరిగిందని వినికిడి.  దిల్ రాజు ఈ రైట్స్ తీసుకున్నారు.

also read: Bheemla Nayak: పవన్‌ ఫ్యాన్స్ కి బిగ్‌ షాక్‌..`భీమ్లా నాయక్‌` రీషూట్‌.. దర్శకుడిగా త్రివిక్రమ్?

click me!