Bheemla Nayak: ఏపీ టికెట్ ధరల ఎఫెక్ట్.. 'భీమ్లా నాయక్'కి 10 కోట్లకు పైగా లాస్

pratap reddy   | Asianet News
Published : Nov 23, 2021, 04:44 PM IST
Bheemla Nayak: ఏపీ టికెట్ ధరల ఎఫెక్ట్.. 'భీమ్లా నాయక్'కి 10 కోట్లకు పైగా లాస్

సారాంశం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలసి నటిస్తున్న చిత్రం 'బీమ్లా నాయక్'. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలసి నటిస్తున్న చిత్రం 'బీమ్లా నాయక్'. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పార్లల్ గా జరుగుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్స్, సాంగ్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. 

Pawan Kalyan ఫ్యాన్స్ ఈ చిత్రం కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. అయితే భీమ్లా నాయక్ చిత్ర రిలీజ్ పై అటు ఇండస్ట్రీలో, ఇటు అభిమానుల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎందుకంటే భీమ్లా నాయక్ తో పాటు రాజమౌళి ఆర్ఆర్ఆర్, ప్రభాస్ రాధే శ్యామ్ చిత్రాలు సంక్రాంతి రేస్ లో ఉన్నాయి. దీనితో మూడు చిత్రాల వసూళ్లకు నష్టం తప్పదనే అంచనాలు ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. 

ఎలాగైనా పవన్ ని, Bheemla Nayak నిర్మాతని కన్విన్స్ చేసి పోస్ట్ పోన్ చేసే ప్రయత్నాలో ఇతర నిర్మాతలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే భీమ్లా నాయక్ నిర్మాత వెనక్కి తగ్గడం లేదు. తాజా సమాచారం మేరకు భీమ్లా నాయక్ ప్రీరిలీజ్ బిజినెస్ దాదాపుగా ఫినిష్ అయినట్లు తెలుస్తోంది. 

ఆంధ్రప్రదేశ్ లో ఉండే టికెట్ ధరల్ని, ప్రభుత్వ ఆంక్షలని దృష్టిలో పెట్టుకునే బయ్యర్లు ఈ చిత్రాన్ని కొన్నారట. భారీ మొత్తం వెచ్చించకుండా రీజనబుల్ రేట్లకే భీమ్లా నాయక్ హక్కులు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా పవన్ కళ్యాణ్ చిత్రాలకు రూ.100 కోట్లకు పైగా ప్రీరిలీజ్ బిజినెస్ జరుగుతుంది. అయితే ఏపీ లో టికెట్ ధరల్ని దృష్టిలో ఉంచుకుని బయ్యర్లు భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ బిజినెస్ 90 కోట్లకు ముగించినట్లు తెలుస్తోంది. దీనితో ప్రీ రిలీజ్ బిజినెస్ లో ఈ చిత్రానికి 10 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని ట్రేడ్ భావిస్తోంది. 

అయితే దీనివల్ల ఓ అడ్వాంటేజ్ కూడా ఉంది. జనవరి లోపు ఏపీ ప్రభుత్వం టికెట్ ధరల పెంపుకు అనుమతి ఇస్తే డిస్ట్రిబ్యూటర్లకు లాభాల పంట పడుతుంది. ప్రీ రిలీజ్ బిజినెస్ తక్కువే కాబట్టి రికవరీ కూడా సులభం అవుతుంది. 

సాగర్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న భీమ్లా నాయక్ మూవీలో పవన్ కి జోడిగా నిత్యామీనన్.. రానా సరసన సంయుక్త మీనన్ నటిస్తున్నారు. త్రివిక్రమ్ ఈ చిత్రానికి మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. 

Also Read: రెచ్చిపోయిన నందిని రాయ్.. హాట్ థైస్ అందాలతో మతిపోగోట్టే ఫోజులు

Also Read: 'అద్భుతం' మూవీకి చిరంజీవి ఫిదా.. నావల్ కాన్సెప్ట్ అంటూ ప్రశంసలు, బుడ్డ ఇంద్ర వెరీ హ్యాపీ!

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bharani Elimination: ఫలించని నాగబాబు ప్రయత్నం, భరణి ఎలిమినేట్‌.. గ్రాండ్‌ ఫినాలేకి చేరింది వీరే
Suman Shetty Remuneration: బిగ్‌ బాస్‌ విన్నర్‌ ప్రైజ్‌ మనీని మించి పారితోషికం.. సుమన్‌ శెట్టికి దక్కింది ఎంతంటే?