EMK: గురువుగారే బెటర్ అంటూ ఎన్టీఆర్ పై మహేష్ సెటైర్లు, ప్రోమో వచ్చేసింది

pratap reddy   | Asianet News
Published : Nov 23, 2021, 03:27 PM IST
EMK: గురువుగారే బెటర్ అంటూ ఎన్టీఆర్ పై మహేష్ సెటైర్లు, ప్రోమో వచ్చేసింది

సారాంశం

మహేష్, NTR ఇద్దరూ ఒకరిపై ఒకరు జోకులు వేసుకుంటూ ఫుల్ జోవియల్ గా కనిపిస్తున్నారు. మహేష్ ని మహేష్ అన్న అంటూ ఎన్టీఆర్ ఆప్యాయంగా ఆహ్వానించాడు. 

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా ఎవరు మీలో కోటీశ్వరులు (EMK )షో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఎన్టీఆర్ తన వాక్ చాతుర్యంతో అలరిస్తున్నారు. షోలో పాల్గొనే కంటెస్టెంట్స్ కి ఆసక్తికరమైన ప్రశ్నలు సంధిస్తున్నారు. గ్యాప్ లో వారితో మాట మాట కలిపి సరదాగా ముచ్చటిస్తున్నాడు. ఎన్టీఆర్ కంటెస్టెంట్స్ కి సంధిస్తున్న ప్రశ్నలు, ఆ ప్రశ్నలపై ఉత్కంఠ పెంచుతూ వారితో చర్చించే విధానం ఆకట్టుకుంటోంది. 

ఈ క్రేజీ షోకి అప్పుడప్పుడూ సెలెబ్రిటీలని కూడా ఆహ్వానిస్తున్నారు. తొలి ఎపిసోడ్ కి మెగా పవర్ స్టార్ రాంచరణ్ అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే. ఇక దర్శక ధీరుడు రాజమౌళి, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కలసి ఓ ఎపిసోడ్ లో పాల్గొన్నారు. ఇటీవల దసరా సందర్భంగా సమంత కూడా ఎవరు మీలో కోటీశ్వరులు షోలో పాల్గొంది. ఆ తర్వాత దేవిశ్రీ ప్రసాద్, తమన్ కూడా పాల్గొన్నారు. 

ఇక సూపర్ స్టార్ Mahesh Babu కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. అభిమానుల నిరీక్షణకు త్వరలో తెరపడనుంది. తాజాగా ఎవరు మీలో కోటీశ్వరులు షోకి సంబంధించిన మహేష్ బాబు ప్రోమోని తాజాగా రిలీజ్ చేశారు. అతి త్వరలో మహేష్ బాబు అతిథిగా పాల్గొన్న ఎపిసోడ్ టెలికాస్ట్ కానుంది. తాజాగా విడుదలైన ప్రోమో సరదాగా ఉంది. 

మహేష్, NTR ఇద్దరూ ఒకరిపై ఒకరు జోకులు వేసుకుంటూ ఫుల్ జోవియల్ గా కనిపిస్తున్నారు. మహేష్ ని మహేష్ అన్న అంటూ ఎన్టీఆర్ ఆప్యాయంగా ఆహ్వానించాడు. మహేష్ హాట్ సీట్ లో కూర్చున్నాక అసలు ఆట మొదలైంది. 'కరెక్ట్ ఆన్సర్ చెప్పినా దాన్ని ఇటు తిప్పి అటు తిప్పి అడుగుతున్నావు అంటూ మహేష్ ఎన్టీఆర్ పై సెటైర్ వేసారు. దీనికి ఎన్టీఆర్ ఎదో సరదాగా అని చెప్పాడు. మీ గురువుగారే బెటర్ అని మహేష్ అనడంతో షోలో నవ్వులు పూస్తున్నాయి. 

 

ఇక సినిమాల విషయానికి వస్తే మహేష్ బాబు ప్రస్తుతం 'సర్కారు వారి పాట' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో నటించిన ఆర్ఆర్ఆర్ జనవరి 7న రిలీజ్ కు రెడీ అవుతోంది. 

Also Read: ఒంపుసొంపులతో హీట్ పెంచేస్తున్న అనన్య పాండే.. అదరహో అనిపిస్తున్న ఘాటైన పరువాలు

PREV
click me!

Recommended Stories

Top 6 Romantic Movies: 2025లో టాప్ 6 రొమాంటిక్ మూవీస్, ఆ ఒక్క సినిమాకి ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్
2025లో నిర్మాతలను భయపెట్టిన టాప్ 4 డిజాస్టర్ సినిమాలు