‘పాగల్’ కలెక్షన్స్ నిజంగానే పిచ్చిక్కిస్తున్నాయా?

Surya Prakash   | Asianet News
Published : Aug 17, 2021, 09:18 AM IST
‘పాగల్’ కలెక్షన్స్ నిజంగానే పిచ్చిక్కిస్తున్నాయా?

సారాంశం

 పాగల్ ఫ్లాప్ అవుతే పేరు మార్చుకుంటా అని కామెంట్స్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేశాడు విశ్వక్ సేన్. ఇక ఈ కలెక్షన్స్ చూస్తుంటే పేరు మార్చుకోవాల్సిన అవసరం లేదా అనేది డిసైడ్ చేసుకోవాలంటున్నారు సోషల్ మీడియా జనం.     


రీసెంట్ గా రిలీజ్ అయిన విశ్వక్ సేన్ ‘పాగల్’ మూవీ విడుదలై దుమ్ముదులుపుతుంది అంటూ మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. టాక్ కి సంబంధం లేకుండా ఈ మూవీ కోసం జనాలు థియేటర్లకు వస్తున్నారని  అంటున్నారు. అంతేకాదు తొలి రెండు రోజుల్లోనే పాగల్ మూవీ మంచి కలెక్షన్స్ తో బ్రేక్ ఈవెన్ దాటిపోయినట్టు ట్రేడ్ లో వినిపిస్తోందని అంటున్నారు..ఇందులో నిజమెంత,కేవలం కావాలని ఓ వర్గం మీడియా చేస్తున్న  ప్రచారమా అనేది చాలా మంది సోషల్ మీడియాలో డిస్కషన్ చేసుకునే విషయంగా మారింది. 

విశ్వక్ సేన్ హీరోగా నరేష్ కుప్పిలి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘పాగల్’. ‘లక్కీ మీడియా’ బ్యానర్ పై బెక్కం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మించగా ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ అధినేత దిల్ రాజు సమర్పకుడిగా వ్యవహరించారు. రధన్ సంగీత దర్శకుడు. ఆగష్ట్ 14న విడుదలైన ఈ చిత్రానికి మౌత్ టాక్ ఆశించిన విధంగా రాలేదు. అయినప్పటికీ మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ నే సాధించిందని ట్రేడ్ టాక్. రెండో రోజు కూడా జస్ట్ ఓకే అనిపించింది. కానీ.. బ్రేక్ ఈవెన్ కావాలి అంటే వీక్ డేస్ లో కూడా బాగా రాబట్టాల్సి ఉంది. కానీ పరిస్దితి అలా లేదు అంటున్నారు.

సమర్పకుడైన దిల్ రాజు ఈ సినిమాని ఈ రోజుల్లో ఆర్యగా అభివర్ణించారు. అయితే ఈ విషయంలో చాలా ట్రోలింగ్ జరుగుతోంది. ఎందుకంటే అంత సీన్ థియేటర్స్ వద్ద కనపడటం లేదు కాబట్టి. రిలీజైన శని,ఆ తర్వాత రోజు ఆదివారంనాడే పరిస్దితి అనుకూలంగా లేదు. శనివారం మధ్యాహ్నంకే రివ్యూలు నెగిటివ్ గా రావటంతో, మౌత్ టాక్ బాగా స్ర్పెడ్ అయ్యింది. అది కలెక్షన్స్ బాగా పడింది.  ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చినా కలెక్షన్స్ మాత్రం దుమ్ము దులుపుతున్నట్టు స్వయంగా హీరో విశ్వక్  చెప్పాడు.

‘పాగల్’ చిత్రానికి రూ.6.3 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావడానికి రూ.6.5 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. రెండు రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.2.64 కోట్ల షేర్ ను రాబట్టింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే మరో రూ.3.9 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది అంటున్నారు. అందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. 

మరో ప్రక్క పాగల్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో విశ్వక్ సేన్ చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పాగల్ ఫ్లాప్ అవుతే పేరు మార్చుకుంటా అని కామెంట్స్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేశాడు విశ్వక్ సేన్. ఇక ఈ కలెక్షన్స్ చూస్తుంటే పేరు మార్చుకోవాల్సిన అవసరం లేదా అనేది డిసైడ్ చేసుకోవాలంటున్నారు సోషల్ మీడియా జనం.   

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి
Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?