Pawan Kalyan:ఎట్టకేలకు పవన్ ఫ్యాన్స్ హ్యాపీ!

Published : Mar 16, 2022, 04:11 PM ISTUpdated : Mar 16, 2022, 04:12 PM IST
Pawan Kalyan:ఎట్టకేలకు పవన్ ఫ్యాన్స్ హ్యాపీ!

సారాంశం

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎన్నాళ్ళనుంచో ఎదురు చూస్తున్న కాంబినేషన్ దర్శకుడు హరీష్ శంకర్ తో. గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఆయనంటే పవన్ ఫ్యాన్స్ లో విపరీతమైన అభిమానం. ఎట్టకేలకు ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చింది. 

పవన్ కళ్యాణ్ వరుస పరాజయాలతో కొట్టుమిట్టాడుతున్న సమయంలో దిగింది గబ్బర్ సింగ్. సల్మాన్ ఖాన్ హీరోగా హిందీలో సూపర్ హిట్ కొట్టిన దబంగ్ చిత్రానికి గబ్బర్ సింగ్ అధికారిక రీమేక్. పోలీస్ అధికారికంగా పవన్ (Pawan Kalyan)క్యారెక్టర్ ని ఓ రేంజ్ లో ఎలివేట్ చేశాడు దర్శకుడు హరీష్ శంకర్. ఆయన రాసిన వన్ లైనర్స్ కూడా బాగా పేలాయి. 2012లో విడుదలైన గబ్బర్ సింగ్ ఆ ఏడాది టాప్ గ్రాసర్స్ లిస్ట్ లో చేరింది. అదే సమయంలో పవన్ ఫ్యాన్స్ కోరుకునే విధంగా ఆ మూవీ తెరకెక్కింది. 

పవన్ కి మరపురాని విజయాన్ని అందించిన హరీష్ శంకర్(Hareesh Shankar) తో పవన్ మూవీ చేయాలని ఫ్యాన్స్ ఎప్పటి నుండో కోరుకుంటున్నారు. కానీ ఆ ప్రాజెక్ట్ డిలే అవుతూ వస్తుంది. దానికి తోడు ప్రజాసేవకే జీవితం, ఇకపై సినిమాలు చేయనని పవన్ కళ్యాణ్ ప్రకటించడంతో హరీష్ తో మూవీ ఇక కలే అని అందరూ అనుకున్నారు. 2019 ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత పవన్ తన నిర్ణయం మార్చుకున్నాడు. సినిమాలు చేస్తున్నట్లు ప్రకటించారు. వరుసగా నాలుగైదు చిత్రాలు పవన్ ప్రకటించగా... వాటిలో హరీష్ శంకర్ మూవీ ఒకటి. 

ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న కాంబినేషన్ కావడంతో సాధారణంగానే ఈ మూవీపై హైప్ నెలకొంది. భవదీయుడు భగత్ సింగ్ (Bhavadeeyudu Bhagath singh) టైటిల్ ఈ చిత్రానికి హరీష్ నిర్ణయించాడు. ఈ మూవీ ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుండగా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కి నిరాశే ఎదురవుతుంది. కారణం పవన్ మధ్యలో భీమ్లా నాయక్ చేశారు. ఈ రీమేక్ కోసం మూడు నెలలు కేటాయించిన పవన్ హరి హర వీరమల్లు, భవదీయుడు చిత్రాల షూటింగ్ హోల్డ్ లో పెట్టాడు. 

కాగా మరో తమిళ రిమేక్ చేస్తున్నట్లు వార్తలు ప్రచారంలో ఉన్నాయి. దీంతో భవదీయుడు భగత్ సింగ్ షూటింగ్ మరింత ఆలస్యం అవుతుందని అందరూ భావించారు. అయితే దీనిపై ఓ క్లారిటీ వచ్చింది. జూన్ నెల నుండి భవదీయుడు భగత్ సింగ్ మూవీ సెట్స్ పైకి వెళ్లనుందట. అంటే 2023లో ఈ మూవీ విడుదల కానుందని స్పష్టమవుతుంది. దేనితో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. హరి హర వీరమల్లు కంటే కూడా హరీష్ చిత్రం మీదే ఫ్యాన్స్ హోప్స్ పెట్టుకున్నారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా