
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఓ సినిమా చేయబోతున్నట్లు డాలీ డైరెక్టర్ గా రామ్ తాళ్లూరి నిర్మాతగా సినిమా రూపొందనున్నట్లు వార్తలు వచ్చాయి. దీనిపై స్పందించిన పవన్ తన జీవితం ప్రజాసేవకే అంకితమంటూ, సినిమాలు చేసే ఆలోచన లేదని క్లారిటీ ఇచ్చేశారు.
పవన్ ఇలా ఓ ప్రకటన చేయడం వెనుక కారణం ఆయన ఈగో హర్ట్ అవ్వడమే అని సమాచారం. నిజానికి పవన్ కళ్యాణ్.. డాలీ దర్శకత్వంలో ఎన్నికలలోపు ఓ సినిమా ప్లాన్ చేశారట. వరుణ్ తేజ్ హీరోగా నటించే ఈ సినిమాలో పవన్ కళ్యాన్ కీలకమైన అతిథి పాత్రలో నటించడానికి ఒప్పుకున్నారు. రామ్ తాళ్లూరి నిర్మాత.
ఈ సినిమాకు సంబంధించిన కొన్ని పనులు కూడా పూర్తయ్యాయి. త్వరలోనే ప్రకటించాలని అనుకునేలోపు.. విషయం బయటకి పొక్కింది. ఈ సినిమాకి సంబంధించిన విషయాన్ని ఎవరికీ తెలియనివ్వకూడదని తానే నేరుగా మీడియాకి వెల్లడిస్తానని పవన్ ముందే చెప్పారట. కానీ చిత్రయూనిట్ లో జరిగిన కొన్ని తప్పిదాల కారణంగా విషయం బయటకి వచ్చేసింది.
తన అనుమతి లేకుండా సమాచారం బయటకి వెళ్లడంతో పవన్ అసహనానికి లోనయ్యాడట. కొందరు తొందరపాటుతో తన మాటను పక్కన పెట్టారని పవన్ ఫీల్ అయినట్లు తెలుస్తోంది. ఆ కారణంగానే ఈ సినిమాను పక్కన పెట్టేయాలని నిర్ణయించుకున్నాడని పవన్ క్లోజ్ సర్కిల్స్ ద్వారా తెలుస్తోంది.
తన పొలిటికల్ ఫిల్మ్ పై పవన్ క్లారిటీ!
పొలిటికల్ చిత్రంలో పవన్, డైరక్టర్ ఎవరంటే..?
బ్రేకింగ్ అప్డేట్: పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో పవన్ పవర్ఫుల్ మూవీ?