పవన్ కళ్యాణ్.. బ్యాక్ టు పెవిలియన్..?

Published : Apr 09, 2019, 12:42 PM IST
పవన్ కళ్యాణ్.. బ్యాక్ టు పెవిలియన్..?

సారాంశం

పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లో వచ్చే వందల కోట్ల ఆదాయాన్ని వదులుకొని రాజకీయాల్లోకి వెళ్లారు. 

పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లో వచ్చే వందల కోట్ల ఆదాయాన్ని వదులుకొని రాజకీయాల్లోకి వెళ్లారు. ఈ విషయాన్ని ఆయన చాలా సార్లు చెప్పారు. అంత ఆదాయాన్ని వదులుకొని ప్రజల కోసం పాలిటిక్స్ నమ్ముకున్నానని చెబుతుంటారు.

రాబోయే ఎన్నికల్లో సీఎం అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం వస్తోన్న సర్వేల వివరాలను బట్టి చూసుకుంటే సీఎం సంగతి తరువాత పవన్ ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా కూడా ఉండే అవకాశాలు కనిపించడం లేదు. ఈ విషయాలను పక్కన పెడితే టాలీవుడ్ లో పవన్ గురించి కొన్ని వార్తలు హల్చల్ చేస్తున్నాయి.

సినిమాల్లోకి పవన్ రీఎంట్రీ ఈ ఏడాదిలోనే ఉంటుందని అంటున్నారు. పవన్ కి బాగా నచ్చిన దర్శకుడు, నిర్మాత కాంబినేషన్ లో సినిమా ఉంటుందని టాక్. అయితే ఈ వ్యవహారాన్ని చాలా సీక్రెట్ గా ఉంచుతున్నారట. ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత దీనికి సంబంధించిన విషయాలు బయటకి వస్తాయి.

నిజానికి పవన్ కళ్యాణ్ నిర్మాతల వద్ద తీసుకున్న అడ్వాన్స్ లను తిరిగివ్వలేదు. అవన్నీ అప్పులుగా ఎన్నికల డిక్లరేషన్ లో చూపించారు. సినిమాలు చేసే ఆలోచన ఉంది కాబట్టే పవన్ అడ్వాన్స్ తిరిగివ్వలేదని అంటున్నారు. భవిష్యత్తులో పవన్ ని అభిమానులు వెండితెరపై చూసే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

ప్రభాస్, రామ్ చరణ్ తో పాటు.. 2026లో బాక్సాఫీస్ ను షేక్ చేయబోతున్న స్టార్ హీరోల సినిమాలు
Bigg Boss Telugu 9: నిధి అగర్వాల్ కి చుక్కలు చూపించిన ఇమ్మాన్యుయేల్.. హౌస్ లో కూడా ఆమె పరిస్థితి అంతేనా ?