ఆవేశపడ్డ కాజల్.. చీవాట్లు పెడుతోన్న నెటిజన్లు!

By Udaya DFirst Published Apr 9, 2019, 12:13 PM IST
Highlights

దక్షిణాది చిత్రాలతో బిజీగా గడుపుతోన్న కాజల్ అగర్వాల్ చేసిన ఓ పనికి ఇప్పుడు నెటిజన్లు ఆమెకు చీవాట్లు పెడుతున్నారు. 

దక్షిణాది చిత్రాలతో బిజీగా గడుపుతోన్న కాజల్ అగర్వాల్ చేసిన ఓ పనికి ఇప్పుడు నెటిజన్లు ఆమెకు చీవాట్లు పెడుతున్నారు. వివరాల్లోకి వెళితే.. పీఎం నరేంద్రమోదీ పేరుతో బయోపిక్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో మోదీగా నటుడు వివేక్ ఒబెరాయ్ నటించాడు.

త్వరలోనే విడుదల కావాల్సిన ఈ సినిమాపై ఎన్నికల సమయం కావడంతో పలు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. సినిమాకి సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చిన బోర్డ్ సభ్యుల మీద కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఈ సినిమా వివాదాంశంగా మారింది. తాజాగా వివేక్ ఒబెరాయ్ తన సోషల్ మీడియాలో ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్ పెట్టాడు.

దీనిపై కామెంట్ చేస్తే.. ఎలాంటి వ్యతిరేకతకు గురికావాల్సి వస్తుందోనని సినీ ప్రముఖులు ఎవరూ కూడా మాట్లాడడం లేదు. కాజల్ మాత్రం తన స్పందన వ్యక్తం చేసింది. సినిమా బాగుంటుందని నమ్ముతున్నట్లు, సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు  చెప్పింది. దీంతో కాజల్ పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

'ఇది ఎన్నికల ప్రచార చిత్రమనే విషయం తెలుసా..?' అంటూ ఒకరు కామెంట్ చేస్తే.. 'రాజకీయాలపై ఆశ కలుగుతోందా..?' అంటూ మరొకరు కామెంట్ చేస్తున్నారు. మరికొందరైతే.. తమిళనాడులో కాజల్ సినిమాలు నిషేధించేలా స్టాలిన్ చర్యలు తీసుకోవాలని ఆమెపై దాడి చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో కాజల్ పరిస్థితి దారుణంగా మారింది. 

click me!