Corona virus: స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కి కరోనా!

By Sambi ReddyFirst Published Jan 7, 2022, 1:54 PM IST
Highlights

థమన్ స్వల్ప లక్షణాలతో కోవిడ్ నిర్ధారణ అయ్యిందని తెలుస్తుంది. ఇక థమన్ కి కోవిడ్ సోకిందన్న వార్త తెలుకున్న అభిమానులు, సన్నిహితులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని విషెష్ తెలియజేస్తున్నారు. 


మ్యూజిక్ డైరెక్టర్ థమన్(Thaman) కి కరోనా సోకినట్లు సమాచారం అందుతుంది. దీనిపై థమన్ స్పష్టత ఇవ్వకున్నప్పటికీ ఆయన సన్నిహితుల ద్వారా ఈ విషయం బయటికి వచ్చినట్లు వినికిడి. ఆయనకు స్వల్ప లక్షణాలతో కోవిడ్ నిర్ధారణ అయ్యిందని తెలుస్తుంది. ఇక థమన్ కి కోవిడ్ సోకిందన్న వార్త తెలుకున్న అభిమానులు, సన్నిహితులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని విషెష్ తెలియజేస్తున్నారు. 

రెండు రోజుల క్రితం థమన్ తన కొత్త మూవీ యూనిట్ సభ్యులతో ఆహ్లాదంగా గడిపారు. జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ ఓ మూవీ ప్రకటించారు. ఈ మూవీకి సంగీత దర్శకుడిగా థమన్ ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో థమన్, అనుదీప్, నవీన్ పోలిశెట్టి, శివకార్తికేయన్ నైట్ పార్టీలో కలవడం జరిగింది. థమన్ కి కరోనా సోకిన నేపథ్యంలో వీరందరిలో టెన్షన్ నెలకొననుంది. 

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా థమన్ చేతి నిండా ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. మహేష్ (Mahesh babu)సర్కారు వారు పాట (Sarkaru vaari paata)తో పాటు టాలీవుడ్ లో తెరకెక్కుతున్న పలు ప్రాజెక్ట్స్ కి అతడు మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్నారు. మరి ఆయన కోలుకునే వరకు కొంత ఆటంకం ఏర్పడే సూచనలు కలవు. 

ఇక వరుసగా టాలీవుడ్ ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. కొద్దిరోజుల క్రితం మంచు మనోజ్ తనకు కరోనా సోకినట్లు వెల్లడించారు. నిన్న గురువారం అదే కుటుంబానికి చెందిన మంచి లక్ష్మీ తనకు కరోనా సోకినట్లు సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. బాలీవుడ్ లో కరీనా కపూర్, ఏక్తా కపూర్, స్వర భాస్కర్ లకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. 

నిన్న సూపర్ స్టార్ మహేష్ బాబు కరోనాకు గురయ్యారు. తనకు కరోనా సోకినట్లు మహేష్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. దీనితో మహేష్ అభిమానుల్లో చిన్నపాటి ఆందోళన నెలకొంది. అయితే తనకు కొద్దిపాటి లక్షణాలు మాత్రమే ఉన్నట్లు మహేష్ తెలపడం ఊరట కల్గించే అంశం. 

' నా అభిమానులు, శ్రేయోభిలాషులందరికీ.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ నాకు కోవిడ్ పాజిటివ్ గా తేలింది. కొద్దిపాటి లక్షణాలు ఉన్నాయ్. దీనితో నేను నా ఇంట్లోనే ఐసొలేషన్ లో ఉంటున్నా. వైద్యుల సూచనలతో జాగ్రత్తలు తీసుకుంటున్నా. నాతో కొన్నిరోజులుగా కాంటాక్ట్ లో ఉన్నవారు తప్పనిసరిగా కోవిడ్ టెస్ట్ చేయించుకోండి. తప్పకుండా ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోండి. వ్యాక్సిన్ కోవిడ్ రిస్క్ ని తగ్గిస్తుంది. అలాగే కోవిడ్ నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా ఉండండి' అని మహేష్ బాబు ట్విట్టర్ లో తెలిపారు. ఇటీవల మహేష్ బాబు తన ఫ్యామిలీతో దుబాయ్ టూర్ వెళ్లొచ్చిన సంగతి తెలిసిందే

click me!