
సమ్మర్ కానుకగా రిలీజ్ అయ్యి తుప్పు పట్టిన రికార్డులు దుమ్ముదులుపుతున్న సినిమా రంగస్థలం. రాంచరణ్ సమంతల నటన, ప్రత్యేక ఆకర్షనగా నిలిచింది. కళ్లు చెదిరే కలెక్షన్లతో దూసుకుపోతున్న రంగస్థలం సినిమాని నిన్న అబ్బాయ్ చెర్రీ ఏర్పాటు చేసిన స్పెషల్ స్క్రీనింగ్ ను చూసిన బాబాయ్ పవన్ కళ్యాణ్.. రంగస్థలం సక్సెస్ మీట్ కు తాను కచ్చితంగా వస్తానని కూడా అన్నాడు.
అయితే.. రంగస్థలం సినిమా గురించి ఇప్పటివరకూ ఎక్కడా స్పందించని వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే.. అది బన్నీ మాత్రమే. నిజానికి సోషల్ మీడియా స్పందించకపోయినా.. రీసెంట్ గా తన బర్త్ డే సందర్భంగా ఓ తెలుగు డైలీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాత్రం రంగస్థలం మూవీ గొప్పదనం గురించి బాగానే చెప్పాడు బన్నీ. అయితే.. ఇప్పుడు రంగస్థలం సక్సెస్ మీట్ కు అల్లు అర్జున్ కూడా రాబోతున్నాడని తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్ తో పాటు అల్లు అర్జున్ కూడా రామ్ చరణ్ మూవీ రంగస్థలం సక్సెస్ మీట్ లో కనిపిస్తారనే విషయం అర్థమయిపోతోంది. ఎలాగూ చిరంజీవి వస్తారనే చెప్పాల్సిన పనే లేదు. మిగిలిన మెగా హీరోలు కూడా ఈ ఈవెంట్ లో సందడి చేసే అవకాశం ఉంది. మరి రంగస్థలం విజయోత్సవ వేడుక సందర్భంగా.. మెగా హీరోలు అంతా ఒకే చోటకు చేరే అవకాశం కనిపిస్తోంది. చాలా రోజులు పవన్ గురించి మాట్లాడని బన్నీ సక్సెస్ మీట్ లో ఏం మాట్లాడుతాడా అని ఫ్యాన్స్ తో పాటు సామాన్య ప్రేక్షకుడు కూడా వేచి చూస్తున్నారు.